ల్యాండ్ పూలింగ్ ప్రకటించిన హెచ్ఎండీఏ

HMDA LAND POOLING SCHEME

హెచ్ఎండిఏ పరిధిలోని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్ కేసర్ మండలం ప్రతాప సింగారం, కొర్రెముల గ్రామాలలో 1,575 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి లోని మోకిల్లాలో 456 ఎకరాల్లో లే అవుట్ లను ల్యాండ్ పూలింగ్ పథకంలో భాగంగా ఫేజ్-1 లో అభివృద్ధి చేయాలని హెచ్ఎండిఏ ప్రతిపాధించిందని, భూయజమానులు తమ సమ్మతి పత్రాలను అందజేసి ఇందులో పాల్గొనాలని హెచ్ఎండిఏ కమీషనర్ శ్రీ అర్వింద్ కుమార్ కోరారు. హెచ్ఎండిఏ ప్రాంతంలో ప్రణాళికాపరమైన అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పథకం, ఏరియా డెవలప్ మెంట్ ప్లాన్, డెవలప్ మెంట్ స్కీం ను GO.Ms.No.306, తేది 7-12.2017 ద్వారా నియమాలను ఆమోదించిందన్నారు. ఈ విషయంపై ఈ ఏడాది మే 2 న, జూన్ 16న ల్యాండ్ పూలింగ్ కోసం ఆసక్తి ఉన్న భూయజమానుల నుండి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్లను హెచ్ఎండిఏ జారీ చేసింది.

ఉప్పల్ భగాయత్ తరహాలో హెచ్ఎండిఏ పరిధిలో లే అవుట్లు వేసి అభివృద్ధి చేస్తారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం సేకరించిన భూమిని ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేస్తారు. ల్యాండ్ పూలింగ్ పథకంలో భూయజమానులు అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే అవకాశం కలుగుతుంది. ప్రతిపాధించిన ప్రాంతంలో అంగీకరించిన భూయజమానుల రైతుల భూములను అభివృద్ధి చేయడంలో హెచ్ఎండిఏ ఫెసిలిటేటర్ గా పనిచేస్తుంది.

పథకం ప్రత్యేకతలివే..

 ఈ పథకంలో రైతుల భూములకు హెచ్ఎండిఏ అభివృద్ధి చేసిన భూములుగా బ్రాండ్ వ్యాల్యూ లభిస్తుంది. ఇతర భూములతో పోలిస్తే అదనపు మార్కెట్ విలువ లభిస్తుంది.
 మంచినీరు, విద్యుత్, పార్కులు, సివరేజ్ లాంటి ప్రపంచస్ధాయి సౌకర్యాలు కలిగిన హౌజింగ్ ప్లాట్లు రైతులు పొందుతారు. వారి అవసరాల మేరకు తమ ప్లాట్లను అభివృద్ధి లేదా అమ్ముకోవచ్చు.
 హెచ్ఎండిఏ నుండి అభివృద్ధి చెందిన భూములు రైతులు పొందుతారు. వీటి విలువ పెరగటంతో పాటు అమ్ముకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
 ఈ పథకంలో రైతులు తమ ప్రపోషినేట్ షేర్ (Proportionate Share) ప్రకారం మంచి ఆక్సేస్ ఉన్న అభివృద్ధి చేసిన భూమిని పొందుతారు. దీని వలన మార్కెట్ విలువ పెరుగుతుంది.
 ఈ పథకంలో రైతులు ప్రపోషినేట్ అండ్ ఈక్విటబుల్ ల్యాండ్ (Proportionate and Equitable) పొందుతారు.
 నగరం ప్రణాళికంగా అభివృద్ధికి, విస్తరించటానికి ఈ పథకం దోహదపడటం తో పాటు మరిన్ని అభివృద్ధి చేసిన భూములు అందుబాటులోకి వస్తాయి.
 బిల్డింగ్ పర్మిషన్ కు అనుమతులు త్వరిత గతిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా లభిస్తాయి.
 ఈ పథకం రైతులు, భూయజమానులు, హెచ్ఎండిఏ మధ్య పారదర్శకంగా అమలవుతుంది. ఎటువంటి మద్యవర్తులు ఉండరు.
 ల్యాండ్ పూలింగ్ చేసిన సమీప ప్రాంతాలలో వాణిజ్యంగా, సంస్ధల పరంగా అభివృద్ధికి అవకాశాలు విస్తృతంగా ఉంటాయి.
 ల్యాండ్ పూలింగ్ స్కీంలో పార్కులు, ఆటస్ధలాలు, కమ్యూనిటిహాల్స్ లాంటి సోషల్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కోసం భూమిని కేటాయించడం జరుగుతుంది.
 ల్యాండ్ పూలింగ్ స్కీంలో ప్రాజెక్టు కాస్ట్ మేరకు Developable Area ను హెచ్ఎండిఏ, భూయజమానుల మధ్య definite ratio or proportion పద్ధతిలో కేటాయిస్తారు.
 ల్యాండ్ పూలింగ్ పథకంలో అభివృద్ధి చేసి అదనపు సౌకర్యాలు కల్పించిన ప్లాట్లను రైతులు / భూయజమానులకు కేటాయిస్తారు.
 భూయజమానులు / రైతులు సమూహంగా ఉంటేనే ఈ విధమైన అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది.
 మాస్టర్ ప్లాన్ లో తెలిపిన ప్రణాళికమైన అభివృద్ధికి ల్యాండ్ పూలింగ్ స్కీంలో పాల్గొనటానికి రైతులు / భూయజమానులు తమ సమ్మతిని అందివ్వాలని కోరడమైనది.

HMDA LATEST UPDATES

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *