హోంమంత్రి ఎంతమందికి అంటించాడో?

Home Minister Positive

తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా సోకడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. కారణం.. గత కొంతకాలం నుంచి హరితహారం వంటి అధికారిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడమేనని తెలుస్తోంది. అంతకంటే ముందు, ఆయన్ని అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతరత్రా ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు వంటివారు కలిశారు. మరి, ఈ జాబితాలో చాలామందే ఉంటారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ లెక్కన ఆయనతో కలిసికట్టుగా తిరిగినవారంతా ఒక్కొక్కరుగా సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళతారా? లేదా? అనేది తేలాల్సి ఉన్నది. వాస్తవానికి, గతంలో ఆయన సీఎం కార్యాలయానికి వెళ్లినప్పుడు, ప్రగతి భవన్లోకి రానివ్వలేదనే సమాచారం బయటికి పొక్కింది. అదంతా తప్పు అని హోంమంత్రి చెప్పారు.

రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.  ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులందరూ పాల్గొంటున్నారు. కరోనా  సమయంలో తక్కువ మందితో నిర్వహించాలి. చేయపోయినా ఫర్వాలేదు.

ప్రభుత్వం ఇప్పటికైనా కాస్త ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. కరోనా సమయంలో ప్రజాప్రతినిధులు, అధికారులను రక్షించుకోవాలి. ప్రభుత్వ కార్యక్రమాల్ని వీలైనంతవరకూ తగ్గించాలి.

  • జూబ్లీ హిల్స్‌లోని అపోలో హాస్పిట‌ల్‌లో హోంమంత్రి మ‌హ‌బూద్ అలీ అడ్మిట్ అయ్యారు. గ‌త బుధ‌వారం.. ఆయ‌న వ‌ద్ద ఉన్న అయిదుగురు గ‌న్‌మెన్లు.. క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలారు. ప్ర‌స్తుతం మ‌హ‌మూద్ అలీ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ది. హాస్పిట‌ల్ సిబ్బంది ఆయ‌న్ను అనునిత్యం ప‌రీక్షిస్తున్నారు. ఆదివారం సాయంత్రం హాస్పిట‌ల్‌లో చేరిన‌ట్లు అధికారులు చెబుతున్నారు.

 

Mahmood Ali Positive

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *