04-08-2019 నుండి 10-08-2019 వరకు వారఫలాలు

Spread the love

Horoscope 04-08-2019 to 10-08-2019 panchangam

మేషరాశి : ఈవారం మొత్తం మీద మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు, వారినుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది, నూతన పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కుటుంబంలో కీలకమయిన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. సోదరులతో చర్చలు చేయుటకు ఆస్కారం కలదు. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే ఆస్కారం కలదు.

వృషభరాశి : ఈవారం మొత్తం మీద స్వల్పదూరప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీఆలోచనల్లో స్పష్టత వస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. బంధువులతో కలిసి సమయాన్ని గడుపుటకు ఆస్కారం ఉంది. సంతానం గురుంచి నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే ఆస్కారం ఉంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయుటకు ఆస్కారం కలదు.

మిథునరాశి: ఈవారం మొత్తం మీద కుటుంబపరమైన విషయాల్లో కాస్త వేచిచూసే ధోరణి మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో ఒకింత వేచిచూసే ధోరణి మేలు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది.

కర్కాటకరాశి : ఈవారం మొత్తం మీద గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన. చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం సూచన. సంతానం విషయంలో నూతన ఆలోచనలు తీసుకుంటారు. పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు , అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్లడం మంచిది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చర్చలకు దూరంగా ఉండుట సూచన.

సింహరాశి : ఈవారం మొత్తం మీద ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో అన్నిపనులను అనుకున్న సమయానికి పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిది. విదేశీప్రయాణప్రయత్నాలు చేయుటకు ఆస్కారం ఉంది. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి.

కన్యారాశి : ఈవారం మొత్తం మీద ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండటం మంచిది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు మొదలు పెడతారు. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది.

తులారాశి: ఈవారం మొత్తం మీద ఒకింత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. మానసికంగా దృడంగా ఉండుట సూచన. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత లేకపోతే ఇబ్బందులు తప్పక పోవచ్చును. ప్రయాణాలు చేయుటకు అవకాశ ఉంది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు చేయుటకు ఆస్కారం కలదు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

వృశ్చికరాశి : ఈవారం మొత్తం మీద పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. మీ మాటతీరు కొంతమందికి నచ్చకపోవచ్చును. ఆరోగ్యంలో ఒకింత ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది, కాబట్టి ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతాయి. ఊహించని ఖర్చలకు ఆస్కారం ఉంది. దైవపరమైన విషయాల్లో సమయం గడుపుతారు. నూతన పరిచయాలకు అవకాశం ఉంది.

ధనస్సురాశి: ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో కొంత పనిభారం పెరుగుటకు అవకాశం ఉంది. నలుగురిని కలుపుకొని వెళ్ళుట సూచన. చేప్పట్టే పనుల విషయంలో స్పష్టత అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి రావడానికి చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి, అనుకూలమైన ఫలితాలు పొందుతారు. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే ఆస్కారం కలదు. బంధువులనుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకొనే ఆస్కారం ఉంది.

మకరరాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగాల్లో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి, అధికారులతో మాటపట్టింపులకు వెళ్ళకండి. చేపఠినపనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. రావల్సిన ధనం సమయానికి చేతికి అందక పోవచ్చును. మిత్రులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. బంధువుల కుటుంబంలో జరిగే కార్యక్రమాలకు హాజరు అవుతారు. చర్చల్లో ఓపిక అవసరం.

కుంభరాశి : ఈవారం మొత్తంమీద కుటుంబంలో ఊహించని విధంగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాస్త సంయమనం అవసరం, ఉదోగంలో ఆశించిన మేర సహకారం అధికారుల నుండి రాకపోవచ్చును. చర్చాపరమైన విషయాల్లో ఓపిక అవసరం. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. విలువైన వస్తువుల కోసం ధనం ఖర్చు పెడతారు. సమాజంలో నూతన పరిచయాలకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయంలో నూతన పెట్టుబడులకు ఆస్కారం ఉంది.

మీనరాశి : ఈవారం మొత్తంమీద చర్చల్లో సమయాన్ని గడుపుటకు ఇష్టపడుతారు. మిత్రులనుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. తగిన జాగ్రతలు తీసుకోవడం సూచన. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. రావలిసిన ధనం కాస్త చేతికి అందుటకు అవకాశం ఉంది. విలువైన వస్తువుల కోసం ధనం సమయానికి చేతికి అందుతాయి. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *