19-05-2019 నుండి 25-05-2019 వరకు వారఫలాలు

Spread the love

Horoscope 19 to 25 th March Panchangam

మేషరాశి :ఈవారం సంతానం విషయంలో నిర్ణయం తీసుకొనే ముందు అనుభవజ్ఞులను లేక పెద్దల అభిప్రయాలను తీసుకోవడం మంచిది. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు.  చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. దైవపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మొండిబకాయిలు వాసులు అయ్యే అవకాశం ఉంది. చర్చాపరమైన విషయాల్లో కాస్త సమయం గడుపుతారు. 

 

 వృషభరాశి :ఈవారం బంధువులను కలుస్తారు, వారితో చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది. వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది, కాస్త జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు కొని కొన్ని ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం ఉంది, ఓర్పు అలాగే నిదానంగా వ్యవహరించుట అవసరం. సంతానం విషయంలో పెద్దల సూచనల మేర ముందుకు వెళ్లుట సూచన. ఆరోగ్యం విషయంలో మాత్రం తప్పక శ్రద్ద తీసుకోండి. స్త్రీ పరమైన విషయాల నుండి లబ్దిని పొందుటకు ఆస్కారం ఉంది. భూ సంభందమైన విషయాల్లో గతంలో ఉన్న ఇబ్బంది తగ్గుటకు ఆస్కారం ఉంది, లబ్దిని పొందుతారు. 

 

మిథునరాశి:ఈవారం దైవపరమైన విషయంలో పాల్గొంటారు , అనుకోకుండా చేసే పనుల్లో విజయం లభిస్తుంది. అధికారుల నుండి ఆశించిన మేర గుర్తింపును పొందుతారు. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. పెట్టుబడుల కోసం చేసిన చర్చలు ముందుకు సాగుతాయి. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి ఊహించని విధంగా సహకారం లభిస్తుంది. బంధువులతో లేదా కుటుంబసభ్యులతో ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగంలో బాగానే ఉంటుంది, సంతానం విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు. చర్చల్లో పాలగొంటారు. 

 

కర్కాటకరాశి :ఈవారం ఆరంభంలో కాస్త మానసికపరమైన ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. గతంలో చేపట్టిన పనుల వలన నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. సోదరులతో ఎటువంటి మాటపట్టింపులకు వెళ్ళకండి, చాలా విషయాల్లో సర్దుబాటు విధానం మంచిది. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. తండ్రితరుపు బంధువుల నుండి నూతన విషయాలను తెలుసుకుంటారు. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడుతాయి. 

 
సింహరాశి :ఈవారం మిత్రులను కలుస్తారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది అలాగే సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే విషయంలో తొందరపాటు వద్దు. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. నూతన పరిచయాలు ప్రయాణాల్లో ఏర్పడుతాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. ఉద్యోగంలో కొంత పనిఒత్తిడి ఉండే అవకాశం ఉంది, నలుగురిని కలుపుకొని వెళ్ళుట మంచిది. సోదరులతో చేసిన చర్చలు మంచి ఫలితాలు ఇస్తాయి. 
 
కన్యారాశి :ఈవారం సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. నూతన నిర్ణయాల విషయంలో ఉత్సుకత ఉంటుంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. జీవితభాగస్వామితో సమయాన్ని సరదాగా గడుఁపుటకు అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయు విషయంలో ఆలోచన వాయిదా వేయుట సూచన. సంతానం నుండి ఆశించిన సహకారం లభిస్తుంది, అలాగే సంతానం విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మిత్రులను కలుస్తారు. 
 

తులారాశి:ఈవారం సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. విలువైన వస్తువులను బహుమతిగా పొందుటకు ఆస్కారం కలదు. ఉద్యోగంలో బాగుంటుంది, ప్రమోషన్ లేక అనుకూలమైన బదిలీకి ఆస్కారం కలదు. కుటుంబములో శుభకార్యక్రమాలు జరుగుటకు ఆస్కారం కలదు. ఎవ్వరితోను విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. రావలిసిన ధనం కాస్త ఆలస్యంగా నైనా చేతికి అందుటకు అవకాశం ఉంది. వాహనాలను లేదా భూమిని కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. మిత్రుల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. 

 
వృశ్చికరాశి :ఈవారం నూతన పరిచయాలకు అవకాశం ఉంది, గతంలో తీసుకున్న నిర్ణయాల వలన సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు. మీ మాటతీరు కొంతమేర పెద్దలను ఇబ్బంది పెట్టుటకు అవకాశం ఉంది. సాధ్యమైనంత మేర అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి రావడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో బాగానే ఉంటుంది, అధికారుల సూచనలతో ఏకీభవించుట వలన మరింతగా లబ్దిని పొందుతారు. స్త్రీ పరమైన విషయాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో వేచిచూసే ధోరణి తప్పక మేలుచేస్తుంది. 
 

ధనస్సురాశి:ఈవారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు, మానసిక పరమైన ఇబ్బందులు తప్పకపోవచ్చును. జీవితభాగస్వామితో విభేదాలు పెరుగుటకు ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. గతంలో తీసుకున్న నిర్ణయాల విషయంలో స్పష్టత వస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. సోదరుల విషయంలో ముఖ్యమైన ఆలోచనలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యక్రమాలు జరుగుటకు అవకాశం ఉంది. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతుంది. చర్చల్లో ఇబ్బందులు ఉంటాయి. 

 

మకరరాశి :ఈవారం వ్యాపారపరమైన విషయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. నూతన పెట్టుబడుల కోసం చేయు ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆత్మీయులలో ఓక్రి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం కలదు. సాధ్యమైనంత మేర మీ నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. పెద్దలను కలుసుకుంటారు, వారినుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. సోదరులతో కలిసి ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. 

 
కుంభరాశి :ఈవారం ఉద్యోగంలో నూతన అవకాశాలను పొందుతారు . పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభ్సితుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తగ్గుతాయి. సర్దుబాటు విధానం మంచిది. బంధువుల నుండి రావల్సిన ధనం చేతికి అందుతుంది. వ్యాపారపరమైన విషయంలో బాగాఉంటుంది, నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. చర్చాప్రమైన విషయాల్లో సమయం గడుపుతారు. విదేశీప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. తల్లితరుపు వారినుండి నూతన విషయాలు తెలుస్తాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ద తీసుకోవడం మంచిది. 
 
మీనరాశి :ఈవారం మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు, వారినుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో ముఖ్యమైన ఆలోచనలు కలిగి ఉంటారు. గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన. తండ్రితరుపు బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విదేశాల్లో ఉన్నవారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార పరమైన విషయాల్లో మాత్రం కాస్త నిదానంగా వ్యవహరించుట సూచన. సంతానం విషయంలో ముఖ్యమైన ఆలోచనలు చేయుట అలాగే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *