17-11-2019 నుండి 23-11-2019 నుండి వారఫలాలు

44
Horoscope from 17-11-2019 to 23-11-2019
Horoscope from 17-11-2019 to 23-11-2019
Horoscope from 17-11-2019 to 23-11-2019

మేషరాశి : ఈవారం మొత్తం మీద చర్చాపరమైన విషయాల్లో పాల్గొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. పెద్దలతో గతంలో ఉన్న విభేదాలు తగ్గుటకు ఆస్కారం ఉంది , కాస్త మీ వంతు ప్రయత్నం చేయుట సూచన. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు సూచితం. బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి, వీటి విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సామాజికపరమైన విషయాల్లో పాల్గొనే అంశంలో మక్కువను కలిగి ఉంటారు. పెద్దలతో పరిచయాలు ఏర్పడుతాయి.

వృషభరాశి :ఈవారం మొత్తం మీద  ఉద్యోగంలో చేసిన నూతన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. విదేశాలలో ఉన్న మిత్రులనుండి నూతన విషయాలు తెలుస్తాయి. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. కుటుంబంలో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే ముందు అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. రుణపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. విలువైన వస్తువులను కాస్త జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. పెద్దలతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అలాగే సర్దుబాటు విధానం మంచిది. 

మిథునరాశి:ఈవారం మొత్తం మీద మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితం. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి ముఖ్యమైన సమాచారం తెలుసుకుంటారు. కుటుంబ పరమైన విషయాలలో కాస్త సర్దుబాటు విధానం మంచిది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. విలువైన వస్తువులను కొనుగులు చేయుటకు ఆస్కారం ఉంది. ముఖ్యమైన నిర్ణయాల్లో కాస్త తడబాటు కలిగి ఉంటారు. ఉద్యోగంలో ప్రదేశం మార్పుకు అవకాశం కలదు. చర్చల్లో పాల్గొంటారు. 
కర్కాటకరాశి : ఈవారం మొత్తం మీద మొదట్లో కాస్తా ఇబ్బందిగా ఉన్న స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, తగ్గించుకోవడంలో విఫలం అవుతారు. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. ఉద్యోగంలో కాస్త ఒత్తిడి తప్పక పోవచ్చును. ఆండ్రాయిని కలుపుకొని వెళ్ళుట సూచన. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేయుట సూచన. ప్రయాణాలు వాయిదా పడుతాయి.
సింహరాశి :ఈవారం మొత్తం మీద విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. ముఖ్యమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సూచితం. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. మీ మాటతీరు నూతన వివాదాలకు దారితీసే అవకాశం కలదు, కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి. మిత్రులనుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి , వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది.
కన్యారాశి :ఈవారం మొత్తం మీద పెద్దలను కలుస్తారు, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. చర్చాపరమైన విషయాల్లో పాల్గొనేందుకు ఆసక్తిని చూపిస్తారు. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు వద్దు. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. కుటుంబంలో కొంత మిశ్రమ స్పందనలు అలాగే నూతన ఆలోచనలకు ఆస్కారం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వారం చివరలో కలిసి వస్తాయి, కాకపోతే ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేయవల్సి వస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది.
తులారాశి:ఈవారం మొత్తం మీద పెద్దలతో పరిచయాలు ఏర్పడుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. గతంలో మీరు చేసిన పనులకు గాను సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో మంచి గుర్తింపును పొందుతారు. సోదరులతో చేపట్టిన చర్చలు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి, నూతన ఆలోచనలను కలిగి ఉంటారు. సంతానపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. 
వృశ్చికరాశి :ఈవారం మొత్తం మీద నూతన పరిచయాలు ఏర్పడుతాయి. నూతన అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వ్యాపారంలో బాగాఉంటుంది. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి ఊహించని సహకారం పొందుతారు. సంతానం విషయాల్లో సంతృప్తి ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే హైరానా చెందుతారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. బంధువులతో సర్దుబాటు విధానం అలాగే చర్చలో నిదానంగా వ్యవహరించుట సూచన. రావాల్సిన ధనం కాస్త కాస్త చేతికి అందుతుంది. కోపాన్ని తగ్గించుకోవడం వలన మేలుజరుగుతుది. మిత్రులను కలుస్తారు.
ధనస్సురాశి: ఈవారం మొత్తం మీద బంధువుల నుండి వచ్చిన సూచనల విషయంలో ఆలోచన చేయుట మంచిది. మీవైన ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితం. కొంత మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. నూతన పరిచయాలకు ఆస్కారం ఉంది. ఉద్యోగాల్లో బాగానే ఉంటుంది. మరింతగా శ్రమించుట ద్వారా మరిన్ని ఉన్నతమైన ఫలితాలు పొందవచ్చును. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు, తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
మకరరాశి :ఈవారం మొత్తం మీద ఆత్మీయులను కలుస్తారు, వారినుండి నూతన విషయాలు తెలుస్తాయి. ఉద్యోగంలో నూతన అవకాశాలు కలిసి వస్తాయి. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మానసికంగా దృడంగా ఉండుట సూచన , చిన్న చిన్న ఇబ్బందులు తప్పక పోవచ్చును. కుటుంబపరమైన విషయంలో నిర్ణయాలు తీసుకొనే ముందు వారై అభిప్రాయాలను తెలుసుకోవడం మంచిది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. తండ్రి తరుపు బంధువులను కలుస్తారు. మీ దగ్గరి వ్యక్తుల ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేస్తారు. 
కుంభరాశి :ఈవారం మొత్తం మీద బంధువులను కలుస్తారు, వారినుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో పెద్దలను కలుసుకునే ఆస్కారం ఉంది. ముఖ్యమైన విషయాల్లో కాస్త ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ మాటతీరు కొంతమందిని ఇబ్బందికి గురిచేసే ఆస్కారం ఉంది, చూస్కోండి. పెద్దాలతో మీకున్న పరిచయం మరింతగా బలపడుతుంది. ఆత్మీయుల ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి.
మీనరాశి : ఈవారం మొత్తం మీద ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకొనే విషయాల్లో పెద్దలను లేదా అనుభవజ్ఞులను సంప్రదించుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు వచ్చిన , అదే స్థాయిలో ఖర్చులకు అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో మీ ఆలోచనలకు పెద్దగా సానుకూలమైన వాతావరణం ఉండకపోవచ్చును. కొంత సర్దుబాటు విధానం మంచిది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం కలదు. ఉద్యోగంలో కాస్త సమయపాలన పాటించుట అలాగే ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకపోవడం వలన తప్పక మేలుజరుగుతుంది.
దైవజ్ఞరత్న,జ్యోతిష సాగర,జ్యోతిష భాస్కర
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం  

srivagdeviastrologyservices
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
9989647466

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here