ఎంత దారుణం? శవానికి వైద్యం..

Hospital Gave Treatment To Dead Body in Hayath Nagar

హైదరాబాద్లోని హయత్ నగర్లో గల ఒక ప్రైవేటు ఆస్పత్రి డబ్బుల కోసం శవానికి వైద్యం చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పైగా, మరణించిన వ్యక్తికి వైద్యం చేసి రూ. 2 లక్షలు వసూలు చేయడం గమనార్హం. మరో రెండు లక్షలిస్తే శవాన్ని అప్పగిస్తామన్న ఆస్పత్రి యాజమాన్యం. ఐదు రోజుల క్రితం పురుగుల మంది ఆత్మహత్యానికి మధు అనే వ్యక్తి పాల్పడ్డాడు. అదే రోజు సన్ రైజ్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. అయితే గురువారం తను మరణించినప్పటికీ.. ఆ విషయాన్ని బయటికి పొక్కనీయకుండా.. తమకు సమాచారం ఇవ్వకుండా డబ్బులు కట్టించుకున్నారని మధు బంధువులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన వ్యక్తికి వైద్యం చేసి డబ్బులు గుంజడం దారుణమైన విషయమని అంటున్నారు. ఈ విషయమై ప్రభుత్వం స్పందించి, తక్షణమే విచారణ జరిపి, ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

telangana hospital crime

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *