గంగుల కమలాకర్ మంత్రిపదవి సీక్రెట్ ఇదే

How Gangula Kamalakar Got Minister Berth?

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు టీఆర్ఎస్ కార్యాచరణను ప్రారంభించింది. గంగుల కమలాకర్ కు మంత్రిగా అవకాశం అందుకే ఇచ్చారని ప్రచారం జోరుగానే జరుగుతుంది. కరీం నగర్ లో బండి సంజయ్ దూకుడుకు చెక్ పెట్టటానికి పావులు కదుపుతుంది గులాబీ పార్టీ. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ స్థానంలో టీఆర్ఎస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో కేసీఆర్ కరీంనగర్ జిల్లాపై ప్రత్యేక దృష్టిని పెట్టారు.ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఈ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.టీఆర్ఎస్‌కు గుండెకాయ లాంటి ఉమ్మడి కరీంనగర్ ఎంపీ స్థానంలో బీజేపీ విజయం సాధించడం టీఆర్ఎస్ నాయకత్వాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఇదే జిల్లాకు చెందిన మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు కూడ సంచలనం కల్గించాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేశారు. ఎంపీ ఎన్నికల్లో ఓటమి పాలైన బోయినపల్లి వినోద్ కుమార్ కు ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మె్న్ పదవిని ఇచ్చారు. ఆయనకు కేబినెట్ ర్యాంకు హోదా ఇచ్చారు.మరో వైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి గతంలో ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ లు మంత్రులుగా ఉన్నారు..ఎన్నికల ఫలితాల తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మరో ఇద్దరిని మంత్రులుగా కేసీఆర్ గా తీసుకొన్నారు.ఈ నెల 8వ తేదీన జరిగిన మంత్రివర్గ విస్తరణలో కేటీఆర్, గంగుల కమలాకర్ లకు కేసీఆర్ చోటు కల్పించారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ప్రస్తుతం నలుగురు మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది ఐదేళ్లలో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు బీజేపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కూడ టీఆర్ఎస్‌కు చుక్కలు చూపించాయి.దీంతో టీఆర్ఎస్ నాయకత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకొంది. బీజేపీ నుండి వచ్చే సవాల్‌కు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నాడు. కరీంనగర్‌ అసెంబ్లీ స్థానంలో ఓటమి పాలైన బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించాడు.గతంలో కరీంనగర్ ఎంపీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా విద్యాసాగర్ రావు పోటీ చేసి విజయం సాధించాడు. ఇదే స్థానం నుండి విద్యాసాగర్ రావు పోటీ చేసి ఓటమి పాలైన సందర్భాలు కూడ ఉన్నాయి.బీజేపీ నాయకత్వం కూడ తెలంగాణపై కేంద్రీకరించింది. దీంతో రానున్న రోజులను దృష్టిలో ఉంచుకొని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంత్రివర్గంలో పెద్దపీట వేశారు.

Ex Minister  Rajaya

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *