అత్యాచారాలను ఆపేదెలా?

How to stop rape?
స‌మాన‌త కోసం పోరాటం
– మాన‌వ హ‌క్కుల‌ వేదిక
– జిల్లా మ‌హా స‌భ‌కు త‌ర‌లివ‌చ్చిన వివిధ ప్ర‌జా సంఘాల కార్య‌క‌ర్త‌లు

శ్రీ‌కాకుళం న‌గ‌రం : మూడంటే మూడు విష‌యాలు రాజ్యంలో అస‌మాన‌త‌, రాజ్యాధిప‌త్యం, పోలీసు పెత్త‌నం వీటిపైనే త‌మ పోరాటం ఎన్న‌టికీ ఉంటుంద‌ని మాన‌వ హ‌క్కుల వేదిక ఉభ‌య రాష్ట్రాల క‌న్వీన‌ర్ వీఎస్ కృష్ణ స్ప‌ష్టం చేశారు. స్థానిక ఎంపీఆర్ లా కాలేజ్ లో  ప‌దో  జిల్లా మ‌హాస‌భ‌ను ఆదివారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..క‌ఠిన చట్టాల అమలు కాకపోవ డానికి కారణం పోలీసు వ్యవస్థ అసమర్థతే అని అభిప్రాయపడుతూ, దిశ నిందితుల ఎన్ కౌంట‌ర్ ను తాము వ్య‌తిరేకిస్తున్నామ‌ని, ఇటువంటి చ‌ర్య‌ల ఫ‌లితంగా వ్య‌వ‌స్థ‌ల్లో కానీ వ్య‌క్తుల నేర ప్ర‌వృత్తిలో కానీ ఆశించిన మార్పులు వ‌స్తాయ‌ని తాము అనుకోవ‌డం లేద‌ని తెలిపారు. ఎన్ని చ‌ట్టాలు అమ‌లులో ఉన్నా, ఎన్ని ప్ర‌భుత్వాలు మారుతూ ఉన్నా సామాజిక‌, సాంస్కృతిక , రాజ‌కీయ విధ్వంసం జ‌రుగుతూనే ఉంద‌ని, వీటి విష‌య‌మై పౌర స‌మాజంలో ఏళ్ల త‌ర‌బ‌డి ఉన్న అస‌మాన‌త‌లు తొల‌గిపోవ‌డం అన్న‌ది సాధ్యం కావ‌డం లేద‌ని, అందుకు పాల‌కుల అల‌స‌త్వం అన్న‌ది ప్ర‌ధాన కార‌ణ‌మని వివ‌రించారు.

వ‌రంగ‌ల్ లో జ‌రిగిన యాసిడ్ దాడి బాధితురాలు ప్ర‌తిమ కూడా తాను ఇలాంటి చ‌ర్య‌ల‌ను స్వాగ‌తించ‌లేననే చెప్పార‌ని, పౌర శిక్షా స్మృతి క‌ఠినంగా అమ‌లు చేయాలంటే అందుకు ఇటువంటి చ‌ర్య‌లు దోహదం అవుతాయ‌నుకోవ‌డం అవివేక‌మ‌ని విమ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో మానవ హ‌క్కుల సంఘం ద‌శ‌నూ దిశ‌నూ నిర్దేశం చేసిన విఖ్యాత సామాజిక‌వేత్త, త‌మ సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు  స్ఫూర్తితో హ‌క్కుల గొంతుక‌ను వినిపింప‌జేసేందుకు స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ రూపొందింపజేసేందుకు  ఈ నెల 14,15 తేదీల్లో తూర్పుగోదావ‌రి జిల్లా, అమ‌లాపురం, క్ష‌త్రియ క‌ల్యాణ మండపం లో ఎనిమిదో రాష్ట్ర మ‌హాస‌భ‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఈ స‌భ‌లలో ఇటీవ‌ల అయోధ్య‌పై వెల్ల‌డ‌యిన తీర్పున‌కు సంబంధించి, అదేవిధంగా క‌శ్మీర్ ప‌రిణామాల గురించి, ఆర్టిక‌ల్ 370 అమ‌లు చేసిన తీరు గురించి, అక్క‌డి పౌర స‌మాజ స్థితి గ‌తుల గురించి చ‌ర్చిస్తామ‌ని అన్నారు. అదే రోజు అమ‌లాపురం క్ష‌త్రియ క‌ల్యాణ మండ‌పం నుంచి  గ‌డియారం స్తంభం మీదుగా మున్సిప‌ల్ ఆఫీసు వ‌ర‌కూ హ‌క్కుల సంఘం కార్య‌క‌ర్త‌ల‌తో భారీ ఊరేగింపు అనంత‌రం బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తామ‌ని పేర్కొంటూ కార్య‌క్ర‌మ స‌ర‌ళిపై మ‌రికొన్ని విష‌యాలు ప్ర‌స్తావిస్తూ, వ‌ర్త‌మాన స‌మాజ రీతుల‌ను విశ్లేషించారు.మ‌రుస‌టి రోజు అంటే డిసెంబ‌ర్ 15న సంస్థాగ‌త కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని వివ‌రించారు. జిల్లా మ‌హా స‌భ‌ల్లో భాగంగా ప‌లువురు వ‌క్త‌లు అనేక వ‌ర్త‌మాన ప‌రిణామాల‌ను, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ‌తీసిన వైనాన్ని నిర‌సించారు. హ‌క్కుల గొంతుక వినిపించారు. స‌భ‌లో తొలుత నిర్ణ‌యించిన అజెండా అనుసారం కశ్మీరులో ప‌రిస్థితులు – ఫెడ‌ర‌ల్ స్ఫూర్తి అన్న అంశంపై కె.సుధ, సుప్రీం కోర్టు తీర్పులు – వాటి ప్ర‌భావం అన్న అంశంపై మ‌హాత్మా జ్యోతీరావు ఫూలే కాలేజ్ ఆఫ్ లా పోస్ట్ కో – ఆర్టినేట‌ర్ వై.రాజేంద్ర ప్ర‌సాద్, రాజ్యాంగం – విలువ‌ల ప‌రిర‌క్ష‌ణ అన్న అంశంపై మాన‌వ‌హ‌క్కుల వేదిక ప్ర‌తినిధి కేవీ జ‌గ‌న్నాథ‌రావు  ప్ర‌సంగించా రు.కార్య క్ర‌మంలో మాన‌వ హ‌క్కుల సంఘం ప్ర‌తినిధులు కేవీ జ‌గ‌న్నాథ‌రావు, ఎం. ఫ‌ల్గుణ రాజు, కూన రాము, స‌వ‌ర నారాయ‌ణ‌రావు, వై.కొండ‌య్య, బీన ఢిల్లీరావు, రామారావు, ఈశ్వ‌రి, కామేశ్వ‌రావు,ఆనంద్, లా క‌ళాశాల విద్యార్థులు, వివిధ ప్ర‌జా సంఘాల ప్ర‌తినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *