హువావే నుంచి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్

HUAWEI Y6 SMART PHONE

  • రష్యా మార్కెట్లో వై6-2019 లాంచ్

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ హువావే నుంచి కొత్తగా మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. హువావే వై6-2019 స్మార్ట్ ఫోన్ ను మంగళవారం రష్యా మార్కెట్లో విడుదల చేసింది. మీడియం రేంజ్ ధరలో ఈ ఫోన్ ను తీసుకొచ్చింది. డ్యూ డ్రాప్‌ నాచ్‌ డిస్‌ప్లే , మీడియా టెక్‌ హీలియో ఏ22 సాక్‌ ప్రాసెసర్‌ తోపాటు ఆండ్రాయిడ్ 9.0 పై ఇది పనిచేస్తుంది. ఈ ఫోన్ ధర రూ.9,770గా కంపెనీ నిర్ణయించింది. అయితే, భారత మార్కెట్లోకి ఇది ఎప్పుడు వస్తుందనే అంశంపై కంపెనీ ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

హువావే వై6 2019 ఫీచ‌ర్లివే…
6.09 అంగుళాల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
1560 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
ఆండ్రాయిడ్ 9.0
మీడియా టెక్‌ హీలియో ఏ22 సాక్‌ ప్రాసెసర్‌
3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌
512 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్
13 మెగాపిక్సల్ సామర్థ్యంతో వెనుక వైపు కెమెరా
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
3020 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాట‌రీ

MOBILE MARKET

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *