భారీ గణపతి శోభాయాత్ర..

HUGE GANAPATHI SHOBHAYATRA

గణేశ నవరాత్రులు ముగిశాయి . ఘనంగా పూజలందుకున్న బొజ్జ గణపయ్యలు గంగమ్మ చెంతకు బయలుదేరారు .వినాయక నిమజ్జనానికి  అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక  చివరి పూజలందుకున్న ఖైరతాబాద్ శ్రీద్వాదశాదిత్య మహాగణపతిని భారీ క్రేన్‌ సాయంతో ట్రక్కుపైకి ఎక్కించారు. హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనోత్సవంగా ఘనంగా జరుగుతోంది. ఖైరతాబాద్ మహా గణపతిని ఉదయం 7 గంటలకే మండపం నుంచి కదిలించారు. ఇక మరికాసేపట్లో  ఖైరతాబాద్ గణేష్‌ నిమజ్జనం కూడా పూర్తికానుంది. దీంతో ట్యాంక్ బండ్‌కు భారీగా జనం చేరుకుంటున్నారు. దీంతో ట్యాంక్ బండ్ ప్రాంతమంతా రద్దీగా మారింది.
భారీ గణపతి శోభాయాత్ర ప్రారంభం కావడంతో స్వామివారిని దర్శంచుకోవడానికి రోడ్డుకు రెండు వైపులా భక్తులు నిలుచుని స్వాగతం పలుకుతున్నారు. హైదరాబాద్‌లో మొదట నిమజ్జనం జరిగేది ఖైరతాబాద్ మహా గణపతేనని నిర్వాహకులు చెబుతున్నారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 6 దగ్గర ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం జరుగుతుంది. ఖైరతాబాద్ శ్రీద్వాదశాదిత్య మహాగణపతిని అన్నింటికంటే ముందే నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మహా గణపతిని సంపూర్ణంగా నిమజ్జనం చేసేందుకు క్రేన్ నెంబర్ 6 దగ్గర 20 ఫీట్లకు పైగా నీరు లోతు పెంచారు. మహా గణపతి  నిమజ్జనంతో మహా ఘట్టం పూర్తి కానుంది .

tags : ganesh chaturdhi, ganesh navarathrulu , khairatabad,  dwadashadithya maha ganapathi , shobha yathra

Related posts:

కరోనా ఎఫెక్ట్ ... వజ్రాల పరిశ్రమకు నష్టం
మీడియాకు పట్టిన కరోనా...
ఇంటర్నెట్‌ ఇక్కడే చీప్‌: కేంద్ర టెలికాం మంత్రి
శబరిమల పెప్పర్ స్ప్రే దాడిపై  సుప్రీం లో పిటీషన్
గుంటూరు డ్రగ్స్ తయారీ  ముఠా గుట్టు రట్టు
ప్రియాంకా రెడ్డి హత్య.. కేసీఆర్ స్పందన ఏదీ ?
మద్యం తాగించి.. మృతదేహాన్ని వదలకుండా పశువుల్లా  
ఒకే కుటుంబంలో ముగ్గురు కలెక్టర్లు
నేరస్తులను ఉరి తియ్యాలని డిమాండ్
అడవి జంతువులు తిరుగుతున్నాయి జాగ్రత్త..
ఏ సమయంలో అయినా 100కు  కాల్  చెయ్యండి
అలా చేస్తే ప్రియాంక రెడ్డి బ్రతికేదేమో...
ప్రియాంకా రెడ్డి హత్య కేటీఆర్ స్పందన...  
ప్రియాంక రెడ్డి పై గ్యాంగ్ రేప్... పోస్టుమార్టం రిపోర్ట్ తేల్చిందిదే
అరెస్టు కాదు ఆహ్వానము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *