అప్పుడు ఎక్కడికి పోయాయి ఈ పౌరహక్కులు.. మానవతం

Human Rights Against On DIsha Accused Encounter
నిందితులను శిక్షించాల్సిందే. అలాగని ఎన్‌కౌంటర్‌ చేయడం కరెక్ట్ కాదు. నాలుగు ప్రాణాలను పోలీస్‌లు అలా ఎలా తీసేస్తారు..? కవరింగ్‌లు కాకపోతే పోలీస్‌లు దగ్గర ​తుపాకులు లాక్కోని బెదిరించేంత సీన్‌ నిందితులకు ఉందా..? సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ ఒత్తి డ్రామా. వాళ్లని చంపేయడానికే ఇలాంటి ప్లాన్‌ వేశారు. కావాలనే చంపారు. దిశ ​హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ తర్వాత పౌర హక్కులు… మానవ హక్కుల సంఘాల నేతలు వినిపిస్తోన్న వాదన ఇది. ఎన్‌కౌంటర్‌ కరెక్ట్‌ కాదంటూ టీవీ డిబేట్స్‌లో ​చేస్తోన్న కామెంట్స్‌ ఇవి. కెమెరాల ముందు కూర్చోని హక్కుల గురించి గుక్కతిప్పుకోకుండా సంఘాలు చెబుతోన్న వివరణలు. ​
నిజమే ప్రాణానికి ప్రాణం పరిష్కారమా అంటే అస్సలు కాదు. చంపారు కాబట్టి వాళ్లని చంపేస్తామంటే కుదురుతుందా అంటే ఏ మాత్రం కుదరదు. అలాగని మదమెక్కి… ​నిలువెల్లా కామంతో కన్ను మూసుకుపోయి… ఏం చేసినా చెల్లిపోతుందనే బలుపుతో ఓ ఆడపిల్లను పొట్టనబెట్టుకుంటే ఎవరూ మాత్రం ఊరుకుంటారు. అయ్యో పాపం ​అనడానికి ఇదేమీ అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్‌ కాదు. అన్నీ తెలిసి పీకలాదాకా తాగి ప్రీ ప్లాన్‌తో చేసిన హత్యాచారం. ఉత్తపుణ్యానికి ఓ ఆడపిల్లను చంపేశారు. తమ ​కామవాంఛకు ఓ అమాయకురాలిని బలి చేశారు. మృతదేహాన్నీ వదలకుండా పైశాచికం చూపించారు. నిర్ధాక్షిణ్యంగా ప్రాణాలు తీసిందే కాక ఆధారాలు దొరకకూడదని ​డెడ్‌బాడీని తగలబెట్టి తాము ఎంత కర్కశకులమో చెప్పుకొన్నారు. అలాంటి వారిని ఊరికే వదిలేయాలా..? అనేది సామాన్యుల ప్రశ్న. దిశ ఘటన సమయంలో ఎక్కడికి ​వెళ్లారు ఇదే పౌర హక్కులు… మానవ హక్కుల నేతలు. చేసింది తప్పే శిక్షించాల్సిందే అన్న మాటలు తప్ప బాధితురాలి వైపు నుంచి ఎందుకు ఆలోచించలేకపోయారు అని ​సూటిగా ప్రశ్నిస్తున్నాడు కామన్‌మ్యాన్‌. ​
ఏం పాపం చేసిందయ్యా నా బిడ్డ…! పెళ్లి చేసుకోని ఆనందంగా బతకాల్సిన అమ్మాయిని ఇలా తగలబెట్టేశారు. ఎంత గుంజుకులాడి ఉంటదో నా బిడ్డ… నా కూతురిని ​చంపడానికి అసలు వాళ్లెవరూ…? అంటూ ఓదార్చడానికి వచ్చిన వారందరి ముందు ఆ కన్నపేగు దీనంగా రోధిస్తుంటే కన్నీరు కార్చని కన్నంటూ లేదు. అయ్యో ఎంత కష్టం ​వచ్చింది ఆ తల్లికి అని బాధ పడని మనిషి లేడు. మా ఆస్థికలను నిమజ్జనం చేస్తారనుకుంటే… నా కూతురు బూడిదని నేను నీళ్లలో కలపాల్సివచ్చిందని ఆ తండ్రి గుక్కపట్టి ​ఏడ్చినప్పుడు ఆ కుటుంబం బాధని అందరూ పంచుకొన్నారు. దిశ హత్యాచారం ఘటన విన్న తర్వాత అంతా కదిలిపోయారు. మన ఇంటి అమ్మాయికే జరిగినట్టు ​ఫీలయ్యారు. మీ పరామర్శలు- సానుభూతులు అక్కర్లేదు. ఆ అమ్మాయి కేసులో న్యాయం చేసిన తర్వాతే ఇటు రండి అంటూ దిశ ఉంటోన్న అపార్ట్‌మెంట్‌ వాసులు గేట్లకు ​తాళం వేసి మరీ నిరసన వ్యక్తం చేశారు. వచ్చిన మంత్రులు, నాయకులను ఘెరావ్‌ చేశారు. అసలే బాధలో ఉంటే ఆ అమ్మాయి తన చెల్లికి కాకుండా పోలీస్‌లకు ఫోన్‌ ​చేయాల్సింది… డయల్‌ 100కి చేసుంటే బతికేదే అంటూ కామెంట్స్. 100కి ఫోన్‌ చేయకపోవడం దిశ చేసిన తప్పు అన్నట్టు వినిపించిన నేతలు మాటలు ఇంకాస్త ఒళ్లు ​మండేలా చేశాయ్‌. దిశ ఘటన ఎంత కదిలించి ఉండకపోతే ఎవరికీ వారు ఇలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉంటారు..? నిందితులకు శిక్ష పడకపోతే ప్రతీ ఒక్కడు ​అలుసు తీసుకొంటాడు. రేపు మా అమ్మాయికి జరగదన్న గ్యారంటీ అంటూ తల్లిదండ్రుల గొంతుకలు ప్రశ్నించాయ్. శిక్ష ఎంత కఠినంగా ఉంటే అంత ఆనందం అంటూ ​సోషల్‌ మీడియా హోరెత్తింది. ఎలా శిక్షించాలనే విషయంలో ఎవరికి తోచిన సలహాలు వారు ఇచ్చారు. దిశతో- ఆమె కుటుంబంతో ఎలాంటి సంబంధం లేకపోయినా ​నిందితులను కఠినంగా శిక్షించాలంటూ న్యాయం కోసం యావత్‌ దేశం రోడ్డెక్కింది. ఇప్పుడు ఎన్‌కౌంటర్‌ వార్తతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ​
మానవ హక్కుల నేతలు చెప్పినట్టు పోలీస్‌లు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం అస్సలు కరెక్ట్‌ కాదు. మరి విచారణ పేరుతో నిందితులను జైల్లో మోపడం కరెక్టా…? ​ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన ఫాస్ట్‌గా న్యాయం జరుగుతుందా…? కోర్టులు.. అప్పీలు అంటూ టైమ్‌ వేస్ట్‌ చేస్తే బాధిత కుటుంబం పరిస్థితి ఏంటి..? నిర్భయ ​కేసులో ఏం జరుగుతోంది..? ఘటన జరిగి ఏడేళ్లైనా కాలాయాపన తప్ప! పైగా క్షమాభిక్ష పెట్టాలంటూ రాష్ట్రపతికి రిక్వెస్ట్‌లు. ఒకవేళ ప్రెసిడెంట్‌ క్షమిస్తే ఉరి నుంచి ​తప్పించుకోని నిందితులేమో ముప్పొద్దుల జైల్లో మింగి కూర్చుంటే… నిర్భయ కుటుంబం మాత్రం ప్రతిరోజూ కూతురిని తల్చుకుని కుమిలిపోవడం మినహా ఏమవుతుంది. ​నిన్నటికి నిన్న ఉన్నావ్ అత్యాచార బాధితురాలిని ఏం చేశారు…? కోర్టు వెళుతుంటే అత్యాచారం చేసిన నిందితులే బాధితురాలిని నడిరోడ్డు మీద తగలబెట్టారు. కొన ​ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది ఆ ప్రాణం. ఇవన్నీ చూస్తూ కూడా నిందితుల తరపున వకాల్తా పుచ్చుకుంటారా? ఎన్‌కౌంటర్‌ తప్పు అంటారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్‌. ​తప్పుకి వెంటనే శిక్ష పడకపోతే భయం ఎక్కడ్నుంచి వస్తుంది? ప్రాణమంటే తీపిన్నోడు ఎవ్వడూ ఇలాంటి క్రూరానికి దిగకుండా ఉండాలంటే ఒక్కోసారి ఇలాంటి ​ఎన్‌కౌంటర్‌లు జరిగితేనే బాగుంటుందేమో అనిపించకమానదు. అలాగని పోలీస్‌ల చర్యను సమర్థించడం కాదు. ఇంకోసారి వాళ్లకి ఎన్‌కౌంటర్‌ చేసే అవసరం రానీయకుండా ​
చట్టాల్లో మార్పులు చేస్తే చాలు. దుమ్ము పట్టిన శిక్షాస్మృతి పుస్తకాలకు బూజు దులిపే బదులు రూల్స్‌ మాట్లాడే బదులు- మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు ​తీసుకునే వెసులుబాటు కల్పించాలని సర్వత్ర వినిపిస్తోన్న మాట. అప్పుడే నిర్భయ- దిశ ఘటనలు రిపీట్‌ అవ్వు. ఎన్‌కౌంటర్‌లు జరగవు. ​

-సౌజన్య సంగోజు

Human Rights Against On DIsha Accused Encounter,Priyanka Reddy Accused Encounter,veterinarian rape and murder

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *