Husband Harassment
కోటి రూపాయలు ఇస్తేనే కాపురం చేస్తానని తేల్చి చెప్పాడు ఓ వ్యక్తి. లేదంటే విడాకులు ఇస్తానని బెదిరిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కడపకు చెందిన కొల్లి వెంకటరమణ, శ్రీదేవి దంపతుల కుమార్తె గాయత్రికి ధర్మవరం పట్టణం సత్యసాయినగర్‌లో నివసిస్తున్న రిటైర్డ్ ఎల్ఐసీ ఆఫీసర్ గుర్రం విజయ్‌కుమార్, లక్ష్మిదేవి దంపతుల కుమారుడు గుర్రం దీపక్‌కుమార్‌తో 2018 డిసెంబర్ 27న వివాహమైంది. అప్పట్లో రూ.20లక్షలు కట్నం, రూ.10 లక్షలు విలువ చేసే బంగారు నగలను అందజేశారు. పెళ్లి అయినప్పటి నుంచి అదనపు కట్నం కోసం భార్యను వేధించేవాడు. రూ. కోటి తీసుకురాకపోతే విడాకులు ఇస్తానంటూ బెదిరించేవాడు. తనకు భర్త కావాలని పోలీసులను వేడుకుంది.