ఆ బాంబ్ పేలుళ్ళ ఘటనలో హైదరాబాద్ ఆర్మీ డాక్టర్ పాత్ర

Hyderabad Army Doctor in the event of the bomb blasts
మరోసారి హైదరాబాద్ తీవ్రవాద కార్యకలాపాలకు వేదికగా మారింది. దేశంలో ఎక్కడ తీవ్రవాద సంఘటనలు జరిగినా…దాని మూలలు హైదరాబాద్ లో ఉంటున్నాయనే ఆరోపణలకు ఊతం ఇస్తూ… మరో సంఘటన వెలుగుచూసింది. ఈ నేపథ్యంలోనే హైదారాబాద్ ఆర్మీ కెప్టెన్‌ను అశ్వక్ అనే డాక్టర్ మసీదులో బాంబు పేలుళ్లలో హస్తం ఉందని పోలీసులు అనుమానించి కేసు నమోదు చేశారు. కాగా బాంబు పేలుళ్లు జరిగినప్పుడు డాక్టర్ అశ్వక్ యూపీలోనే ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. కాగ సాక్షులను తారుమారు చేసేందుకు అశ్వక్ ప్రయత్నాలు చేసినట్టు పోలీసులు ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్న అశ్వక్ తీవ్రవాద కార్యకలాపాల్లో పాలు పంచుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఆర్మీ డాక్టర్‌కు యూపీలోని ఖుషినగర్‌లో జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆర్మీ డాక్టర్‌ను ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషి నగర్ లో బైరాగి పట్టి గ్రామంలో జరిగిన మసీదు లో బాంబు పేలుడు ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ఈ పేలుళ్లకు సంబంధించి ఏడుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వీరుల మసీద్ ఇమామ్ తో పాటు నలుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఇక ఇదే కేసులో హైదరాబాద్లో ఆర్మీ ఆస్పత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్న అశ్వత్ పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *