హైదరాబాద్లో ఫ్లాట్ల ధరలు

HYDERABAD FLAT RATES 2020

హైదరాబాద్లో సొంతిల్లు కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. కానీ, కొందరే ఆ కలను సాకారం చేసుకుంటారు. మరి, మీరు కూడా మీకు నచ్చే ఇంట్లోకి అడుగుపెట్టాలంటే, ముందుగా మీరు ఫ్లాట్ కోసం ఎంత బడ్జెట్ కేటాయిస్తారో చూసుకోండి. ఆ తర్వాత మీ బడ్జెట్ కు తగ్గ ఏరియాలు హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నాయో గమనించండి. మరి, ఎక్కడెక్కడ ఫ్లాట్ల ధరలు ఎంతెంత ఉన్నాయో మీకు తెలుసా..

నార్త్ హైదరాబాద్లోని అల్వాల్లో ఫ్లాట్ కొనాలంటే.. చదరపు అడుక్కీ నాలుగు వేలు పెట్టాల్సిందే. గరిష్ఠంగా ఐదు వేల మూడు వందలు దాకా రేటు ఉన్నది. అమీన్ పూర్లో చదరపు అడుక్కీ రూ.2, 500 నుంచి కొన్ని ఫ్లాట్లు దొరుకుతున్నాయి. బొల్లారంలో 3300 నుంచి 4500, గాజులరామారంలో 3,300 నుంచి 4,800, కోకాపేట్లో 4,700 నుంచి 6,600, కొంపల్లిలో 3,100 నుంచి 4,800, నాగోలులో 3800 నుంచి 5,300 వరకూ ఫ్లాట్లు లభిస్తున్నాయి. అయితే, అపార్టుమెంట్ విస్తీర్ణం, అందులో సదుపాయాలు, బిల్డర్ అవసరాలు, అది ప్రధాన రహదారికి ఎంత చేరువలో ఉన్నది? అక్కడ దొరికే మౌలిక సదుపాయాల్ని బట్టి తుది ధర ఆధారపడుతుందని గుర్తుంచుకోండి. ఇంకా, ఏయే ఏరియాల్లో ఫ్లాట్ల ధరలెలా ఉన్నాయో మీరే ఓ లుక్కెయ్యండి.
కొత్తపేట్ 3,600నుంచి 5,300
ఎల్ బీనగర్ 4,300 నుంచి 6,100
మదీనాగూడ 4,200- 6,200
నాచారం 3,500- 5,600
హఫీజ్ పేట్ 4,400- 6,400
జీడిమెట్ల 3,300- 4,700
అత్తాపూర్ 3,800 నుంచి 5,200
బేగంపేట్ 4,600 నుంచి 6,800
కొల్లూరు 2,600 నుంచి 4,300
పుప్పాల్ గూడ 3,700 నుంచి 5,300

Hyderabad Real Estate News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *