Hyderabad people Hard comments on Ts Government
వరద బాధితులను పరామర్శిచేందుకు వెళ్తున్న టీఆర్ఎస్ నాయకులకు అడుగడుగునా అడ్డుంకులే ఎదురవుతున్నాయి. ఎక్కడికక్కడే ప్రజలు నీలదిస్తున్నారు. తాజాగా మంత్రి తలసానికి నిరసన సెగ తగిలింది. శుక్రవారం ఆయన వరద బాధితులను పరామర్శిచేందుకు గోషామహాల్ నియోజకవర్గం అబిడ్స్ చీరగ్ గల్లీలోని నేతాజీ నగర్ కు వెళ్లారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ తో కలిసి వరద బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. లోకల్ బీజేపీ నాయకులు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో బీజేపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ నాయకులతో పాటు స్థానికులు కూడా మండి పడ్డారు. వరద సాయం టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సాయం బస్తీవాసులకు అందడం లేదని ఆరోపించారు. దాంతో మంత్రి తలసాని చేసేదేమీలేక తూతూమంత్రగా ప్రోగ్రాం ముగించారు.