జూకు వెళాయేరా…!

Hyderabad Zoo Open

కరోనా కారణంగా జనజీవనం స్థంబించిపోయింది. ఇప్పుడిప్పుడే జనజీవనం మెల్లగా తెరుకుంటోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సడలించింది. జంతు ప్రదర్శనశాలలు తెరుచుకోనున్నాయి. రేపటి నుంచి హైదరాబాద్ జూ తెరుచుకోనుంది. ఇందుకోసం జూలోని అన్ని జంతువుల ఎన్‌క్లోజర్‌ దగ్గర ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బ్లీచింగ్‌ పౌడర్‌తో పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నారు. జంతు ప్రదర్శనశాలలోని ప్రతి ప్రాంతాన్ని శానిటైజ్‌ చేస్తున్నారు.. పిల్లలు ఎంతో ముచ్చటపడే టాయ్ రైలు, బ్యాట‌రీ వాహ‌నాల‌ను కూడా సిద్దం చేస్తున్నారు.

లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 15న బంద్‌ అయిన జూపార్క్‌ మళ్లీ ఇన్నాళ్లకు తెరచుకుంటోంది.. ఇక ఇక్కడ కూడా కోవిడ్‌ నిబంధనలను అమలు చేస్తున్నారు.. పది ఏళ్లలోపు పిల్లలు, అరవై ఏళ్లు దాటిన వృద్ధులకు అనుమతి ఉండదు.. జంతు ప్రదర్శనశాలకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్‌ పెట్టుకోవాలి.. మాస్క్‌ లేనివారిని లోపలికి రానివ్వరు..వచ్చినవారందరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన అనుమతిస్తారు. టికెట్ల కోసం గుమిగూడ ఉండేందుకు యాప్‌ను తయారుచేశారు జూ పార్క్‌ అధికారులు. వెబ్‌సైట్‌  www.nehruzoopark.in నుంచి టికెట్లు పొందవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *