కాశీలో చిక్కుకున్న హైదరాబాదీలు

hyderabadi’s held up in kaasi

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని అష్ట దిక్బంధనం చేసింది. ఎవరూ బయటకు రాలేని పరిస్థితి తీసుకొచ్చింది . ఇక అనుకోకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారికి తిప్పలు తెచ్చి పెట్టింది. కాశీ విశ్వేశ్వరుని దర్శనం కోసం వెళ్లిన తెలంగాణ వాసులు కరోనా ఎఫెక్ట్ లాక్ డౌన్ తో అక్కడే చిక్కుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈనెల 16వ తేదీ న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి యాదాద్రి, హైదరాబాద్ జనగామ తదితర ప్రాంతాలకు చెందిన 60 మంది కాశీ కి బయలుదేరారు. ఈ నెల 29 వరకు కాశీవిశ్వేశ్వరుని తోపాటు సమీప పుణ్యక్షేత్రాలను దర్శించుకునే తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది.  కానీ కరోనా మహమ్మారి ఎఫెక్టుతో దేశం మొత్తం లాక్ టౌన్ కావడంతో తో వీరి ట్రైన్ టికెట్లను కూడా రద్దు చేశారు.

ప్రస్తుతం కాశీలోని లష్కర్ రోడ్డు టెంపుల్ వీధి జస్ట్ లుక్ హోటల్ లో ఉంటున్న వీరిని అడుగు కూడా బయట పెట్టనివ్వడం లేదు. కాశీకి వెళ్ళిన బృందంలో ఎక్కువగా 60 ఏళ్లు నిండిన వృద్ధ మహిళలు, వృద్ధులు ఉండడంతో నాలుగు రోజులుగా బందీలుగా ఉన్న నేపథ్యంలో అస్వస్థతకు గురైతే ప్రమాదం ఉందని బోరున విలపిస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కాశీలో ఇరుక్కుపోయిన ఈ ప్రాంతానికి చెందిన 60 మంది భక్తులను ఇక్కడికి తీసుకు రావాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.  తెలంగాణలోని యాదాద్రి, జనగామ ప్రాంతాలకు చెందిన సుమారు అరవై మంది మార్చి 16వ తేదీన కాశీ విశ్వేశ్వరుని దర్శనం కోసం వారణాసి లో చిక్కుకుపోయారు. ఇక వారిని తిరిగి తీసుకొచ్చే సన్నాహాలు చెయ్యాలని కోరుతున్నారు.

tags: corona virus, corona effect, lock down, corona positive, telangana cm kcr, kasi, varanasi, trains cancel,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *