దేశం కోసమే పోరాడుతున్నా

I FOUGHT FOR COUNTRY: CBN

  • ఈవీఎంలతో ఫలితాలు తారుమారు చేసే అవకాశం
  • 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సిందే
  • టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్

ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉండటం వల్లే జర్మనీ వంటి దేశాలు సైతం బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలకు వెళ్తున్నాయని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ చెప్పినట్టే పనిచేస్తోందని విమర్శించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనే డిమాండ్ తో ఆదివారం ఢిల్లీలో ప్రతిపక్షాలు సమావేశమయ్యాయి. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలపై సందేహాలు వ్యక్తంచేశారు. ప్రస్తుత ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించే అవకాశం లేనందున 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని తాము కోరుతున్నట్టు చెప్పారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేస్తామని వెల్లడించారు. ఏపీలో ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయని, తాను దేశం కోసమే ఈ పోరాటం చేస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. తనకు ఓడిపోతాననే భయం లేదని, వెయ్యి శాతం తమదే అధికారం అని స్పష్టంచేశారు. తెలంగాణలో 25 లక్షలకు పైగా ఓట్లను తొలగించి, ఆ తర్వాత అధికారులు క్షమాపణ చెప్పారని దుయ్యబట్టారు. ఇక ఏపీలో కూడా ఈసీ నిర్వాకంతో జనం పలు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. ఏపీలో ఈనెల 11న పోలింగ్ జరగాల్సి ఉండగా.. మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు పోలింగ్ జరిగిందని, ఇదే పద్ధతని ప్రశ్నించారు. వీవీ ప్యాట్ స్లిప్పులు ఏడు సెకన్లపాటు కనిపిస్తాయని చెప్పారని, కానీ చాలాచోట్ల మూడు సెకన్లు మాత్రమే కనిపించాయని పేర్కొన్నారు. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపునకు ఆరు రోజుల సమయం పడుతుందని ఈసీ చెప్పడం పూర్తిగా అవాస్తమని ఆయన స్పష్టంచేశారు. కాగా, యంత్రాలపై తమకు నమ్మకం లేదని, బ్యాలెట్ పేపర్ పైనే తమకు విశ్వాసం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ పేర్కొన్నారు. సమావేశంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ, ఆప్ నేత సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

AP POLITICS

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *