ఆర్మీ క్యాప్ లకు అనుమతి ఇచ్చాం

ICC REPLY TO PCB

  • పాకిస్తాన్ కు ఐసీసీ స్పష్టీకరణ

పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. భారత క్రికెటర్లు తమ అనుమతి తీసుకున్న తర్వాతే ఆర్మీ క్యాప్ లు ధరించి మ్యాచ్ ఆడారని స్పష్టంచేసింది. పుల్వామా ఉగ్రడాదిలో అమరులైన జవాన్లకు నివాళిగా టీమిండియా క్రికెటర్లు రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఆర్మీ క్యాప్ లు ధరించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆ మ్యాచ్ ద్వారా వచ్చిన ఫీజును జాతీయ రక్షణ నిధికి విరాళంగా కూడా ఇచ్చేశారు. అయితే, ఈ విషయంలో ఉలికిపాటుకు గురైన పాకిస్థాన్.. తన వైఖరి మరోసారి బయటపెట్టుకుంది. అలా ఆర్మీ క్యాప్ లు ధరించి క్రికెట్ ఆడటం తప్పంటూ గగ్గోలు పెట్టింది. దీనిపై ఐసీసీకి పాక్ క్రికెట్ బోర్డు ఫిర్యాదు చేయాలని పాక్ మంత్రి ఒకరు సూచించారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి బోర్డు(బీసీసీఐ) క్రికెట్‌ను స్వార్థ రాజకీయాలకు వాడుకుంటోందని ఆరోపిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. గతంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఇమ్రాన్‌ తాహిర్‌, మొయిన్‌ అలీ మైదానంలో రాజకీయాల గురించి మాట్లాడరని, వారిపై ఐసీసీ తీసుకున్న చర్యలే టీమిండియా ఆటగాళ్లపై కూడా తీసుకోవాలని పీసీబీ చైర్మన్‌ ఎహ్‌సాన్‌ మణి డిమాండ్‌ చేశారు. క్రికెట్‌లో రాజకీయాలను మిళితం చేసి బీసీసీఐ తన విశ్వసనీయతను కోల్పోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే పీసీబీ లేఖపై ఐసీసీ స్పందించింది. ఉగ్రదాడిలో అమరులైన సైన్యానికి నివాళులుగా ఆర్మీ క్యాప్‌లతో బరిలోకి దిగుతున్నట్లు బీసీసీఐ తమ దగ్గర అనుమతి తీసుకుందని స్పష్టం చేసింది. దీనికి తాము సమ్మతించాలమని కూడా వెల్లడించింది. అయినప్పటికీ పాక్ తీరు మారలేదు. బీసీసీఐ.. ఐసీసీ దగ్గర అనుమతి తీసుకున్న ఉద్దేశానికి.. ఆచరణకు చాలా తేడా ఉందని, ఈ విషయంలో తమ లాయర్లతో చర్చించి ఐసీసీకి మరోసారి లేఖ రాస్తామని పీసీబీ పేర్కొంది.

SPORTS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *