అక్రమ సంబంధమే కారణమా?

Illegal Affair Killed 9 Members

గొర్రెకుంట బావిలో తొమ్మిది మృతదేహాలు కలకలం సృష్టించిన ఘటనలో మిస్టరీ వీడినట్లు సమాచారం. బీహారుకు చెందిన సంజయ్ కుమార్ ప్రధాన నిందితుడు అని తేలింది. మరణించినవారిలో 23 ఏండ్ల అమ్మాయితో ఉన్న అక్రమ సంబంధమే తొమ్మిది మంది హత్యకు కారణమని సమాచారం. టీఎస్ న్యూస్ సేకరించిన వివరాల ప్రకారం.. మరణించినవారిలో ఉన్న 23  ఏండ్ల అమ్మాయికి సంజయ్ కుమార్ కు అక్రమ సంబంధం నెలకొన్నదని సమాచారం. అయితే, గత కొంతకాలం నుంచి ఆ అమ్మాయిని సంజయ్ ని దూరం పెట్టడంతో అతను తట్టుకోలేకపోయాడని తెలిసింది. అదే సమయంలో ఆ అమ్మాయి వేరే అతనితో సమయం గడుపుతుండటం, అతనితోనే బెదిరించడం వంటివి చేయడంతో సంజయ్ కుమార్ యాదవ్ భరించలేకపోయాడని సమాచారం. అయితే, తన స్నేహితుడితో ఆ అమ్మాయి కుటుంబానికి కూల్ డ్రింక్స్ లో నిద్ర మాత్రల్ని ఇచ్చి.. వారందరినీ గోనే సంచిలో కుక్కి బావిలో పడేయడంతో వారంతా మరణించారని తెలిసింది. ఇదే విషయాన్ని నిందితుడు అంగీకరించాడని సమాచారం. నిందితుడు ఎలా దొరికాడో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మరణించిన వారిలో ఒక వ్యక్తి వాడిని ఫోనుకు ఆశపడి తీసుకోవడంతో, ఆ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా పోలీసులు కూపీ లాగి కేసును విజయవంతంగా చేధించారని సమాచారం. నిందితుడు సంజయ్‌ కుమార్‌ యాదవ్‌ అంగీకరించాడని, అతడిని రేపు మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

#WarangalNineMurdersMystery

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *