కట్టాల్సింది సెక్రెటేరియట్ కాదు…

Hyderabad Illegal Constructions

చెరువులు, కాల్వలను కబ్జా చేసి అపార్టుమెంట్లు కడితే నీళ్లు ఎక్కడికి పోతాయ్. ఆ ఇళ్లలోకే కదా.. గత రెండు దశాబ్దాల్లో హైదరాబాద్లో ఎన్ని చెరువులు కబ్జా అయ్యాయి? ఏయే చెరువును ఎవరు కబ్జా చేశారు? సహకరించింది ఎవరు? సరూర్ నగర్ చెరువు, కూకట్ పల్లి, ప్రగతినగర్, మియాపూర్.. ఇలా చెరువులున్న ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసి అపార్టుమెంట్లను కట్టిన ప్రబుద్ధులెవరు? వీరిలో ఎంతమంది రాజకీయ నేతలుగా వెలిగిపోతున్నారు? లాంటి విషయాలను హైదరాబాద్ ప్రజలు చర్చించుకుంటున్నారు.

నగరాలు, పట్టణాల్లో చెరువులను కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయించి, అపార్టుమెంట్లు, విల్లాలను కట్టేవారిని శిక్షించేలా మున్సిపల్ చట్టంలో నిబంధనల్ని పొందుపర్చాలని, పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో, ఇలాంటి కఠినమైన నిబంధనల్ని పొందుపర్చకపోతే, చెరువులూ ఎక్కడా కనిపించవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మొద్దునిద్ర వీడి, సరైన డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటుచేయాలని పలువురు కోరుతున్నారు. కూల్చాసింది సెక్రటేరియట్ కాదని, డ్రైనేజీ వ్యవస్థ అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *