నవరత్నాల అమలే ప్రాధాన్యం

Spread the love

IMPORTANCE FOR NAVARTNALU IMPLEMENTATION

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈరోజు అసెంబ్లీలో 2019-20 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఎన్నికల సందర్భంగా సీఎం జగన్ ప్రకటించిన నవరత్నాలను అమలు చేసేందుకు వీలుగా వాటికి బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. ఏపీలో ప్రజారవాణా వ్యవస్థను ఎకో ఫ్రెండ్లీగా మారుస్తామని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తిచేస్తామనీ, ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఏపీ బడ్జెట్ 2019-20 ముఖ్యాంశాలు ఇవే…

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రంగానికి రూ.46,858 కోట్ల కేటాయింపు చేస్తున్నట్టు ప్రకటించారు. ఏపీలో వైఎస్సార్ రైతు భరోసా పథకానికి రూ.8,750 కోట్లు, రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్ కోసం రూ.4,525 కోట్లు, సాగునీరు, వరద నివారణకు రూ.13,139 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు . రైతుల పంటకు సంబంధించి ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.3,000 కోట్లు,ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ.2,002 కోట్లు కేటాయింపు చేస్తున్నట్టు తెలిపారు. వైఎస్సార్ రైతు బీమాకు రూ.1,163 కోట్లు,అక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కోసం రూ.475 కోట్లు,రైతన్నలకు ఉచిత బోర్లు వేయించేందుకు రూ.200 కోట్లు,విత్తనాల పంపిణీకి మరో రూ.200 కోట్లు కేటాయింపు చేయ్యనున్నామని తెలిపారు. ఏపీలో వృద్ధులు, వితంతువుల పెన్షన్ల కోసం రూ.12,801 కోట్లు కేటాయింపు చేస్తున్నట్టు వెల్లడించారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖకు రూ.6,587 కోట్లు కేటాయింపు చేస్తున్నట్టు తెలిపారు.అగ్రిగోల్డ్ బాధితులకు సాయం కోసం రూ.1,150 కోట్లు , ఆటో డ్రైవర్ల సంక్షేమానికి రూ.400 కోట్లు ప్రకటించారు. మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి రూ.952 కోట్లు ప్రకటించారు. మొత్తానికి రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ బడ్జెట్ ను ప్రకటించారు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.

For More Interesting News

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *