కంగారూలను కొట్టేశారు

Spread the love

INDIA BEAT AUSTRALIA

  • ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
  • ధావన్ సెంచరీ.. రోహిత్, కోహ్లి అర్థ సెంచరీలు
  • 36 పరుగుల తేడాతో ఆసీస్ పై గెలుపు

ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భారత్ గర్జించించింది. తన రెండో మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. భారత్ విసిరిన 353 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కంగారూలు 316 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో 36 పరుగుల తేడాతో ఆసీస్ పై టీమిండియా గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. శిఖర ధావన్ (109 బంతుల్లో 117), రోహిత్ శర్మ (70 బంతుల్లో 57), విరాట్ కోహ్లి (77 బంతుల్లో 82), హర్థిక్ పాండ్యా (27 బంతుల్లో 48) రాణించడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆసీస్.. 316 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్‌ ఆటగాళ్లలో డేవిడ్‌ వార్నర్‌(84 బంతుల్లో 56), స్టీవ్‌ స్మిత్‌ (70 బంతుల్లో 69), అలెక్స్‌ కేరీ (35 బంతుల్లో 55) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఒకానొక దశలో ఆసీస్‌ లక్ష్యం ఛేదించేలా కనిపించింది. 36.4 ఓవర్లలో మూడు వికెట్లకు 202 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. అయితే 40వ ఓవర్లలో భువనేశ్వర్‌ ఒకే ఓవర్లలో స్మిత్, స్టొయినిస్ ను పెవిలియన్ కు పంపించడంతో భారత విజయం ఖాయమైంది.

భారత్‌ బౌలర్లు జస్ప్రిత్‌ బుమ్రా(3/61), భువనేశ్వర్‌(3/50), చాహల్‌(2/62) కీలక సమయాలలో వికెట్లు తీసి టీమిండియాకు విజయాన్నందించారు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ధావన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. కాగా, ఈ మ్యాచ్ లో ధోని కొత్త కీపింగ్ గ్లోవ్స్ తో బరిలోకి దిగాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో బలిదాన్ చిహ్నం ఉన్న గ్లోవ్స్ తో ధోని మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. దీనిపై ఐసీసీ అభ్యంతరం తెలిపింది. దీంతో బీసీసీఐతో సహా యావత్‌ భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ధోని గ్లోవ్స్‌ మార్చవలసిన అవసరం లేదని, ఐసీసీతో మాట్లాడతామని బీసీసీఐ పేర్కొంది. అయినప్పటికీ ఐసీసీ అంగీకరించలేదు. దీంతో ధోని ఆ చిహ్నం లేని గ్లోవ్స్ వేసుకుని బరిలోకి దిగాడు.

SPORTS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *