చెమ‌టోడ్చి నెగ్గిన భార‌త్‌

Spread the love

INDIA BEAT BANGLADESH BY 28 RUNS

భార‌త్ జ‌ట్టు చెమ‌టోడ్చి, అతి క‌ష్టం మీద బంగ్లాదేశ్ జ‌ట్టు మీద గెలిచింది. భార‌త జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేస్తున్న తీరును చూస్తే.. క‌నీసం నాలుగు వంద‌ల ప‌రుగులైన చేస్తుంద‌ని భార‌త అభిమానులు ఆశించారు. క‌నీసం 370- 385 ప‌రుగులైనా చేస్తుంద‌ని అనుకున్నారు. కానీ, బంగ్లా బౌల‌ర్లు పూర్తిగా మ్యాచును త‌మ నియంత్ర‌ణ‌లోకి తీసుకున్నారు. ప‌రుగుల వ‌ర‌ద పార‌కుండా క‌ట్ట‌డి చేశారు. భార‌త్ బ్యాట్స‌మెన్ల‌ను పూర్తిగా క‌ట్ట‌డి చేసి 314 ప‌రుగుల‌కే ప‌రిమితం చేశారు. రోహిత్ సెంచ‌రి చేయ‌గా, రాహుల్ ఈ మ్యాచులో ఆక‌ట్టుకున్నాడు. ఆత‌ర్వాత రిష‌బ్ పంత్‌, ధోని మాత్ర‌మే కాస్త బ్యాటింగ్ చేయ‌గ‌లిగారు. మిగ‌తావారినిక బంగ్లా అతి త‌క్కువ స్కోరుకే పెవిలియ‌న్ బాట ప‌ట్టించింది. ఇక బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ చివ‌రిగో గెలిచేటంత ప‌ని చేసింది. బుమ్రా త‌న చివ‌రి ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీయ‌గ‌లిగాడు. లేక‌పోతే, ఈ మ్యాచు త‌ప్ప‌కుండా బంగ్లాదేశ్ గెలిచేదే. మొత్తానికి, భార‌త్‌జ‌ట్టును చివ‌రి వ‌ర‌కూ బెంబేలెత్తించ‌డంలో బంగ్లాదేశ్ విజ‌యం సాధించింది. ఈ మ్యాచులో భార‌త్ గెలిచిన‌ప్ప‌టికీ, అది పెద్ద గెలుపు కానే కాద‌ని చెప్పొచ్చు.

ఫీల్డింగ్ అధ్వాన్నం..
ఇంగ్లండ్‌లో చెత్త ఫీల్డింగ్‌లో రికార్డు సృష్టించిన భార‌త జ‌ట్టు, బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచులోనూ అదే త‌ర‌హా ఫీల్డింగ్‌ను కొన‌సాగించింది. ముఖ్యంగా రాహుల్‌, రిష‌బ్ పంత్‌, ష‌మీ త‌దిత‌రుల‌ ఫీల్డింగ్ ఎంతో అధ్వాన్నంగా ఉంది. ఇదే ఫీల్డింగ్‌ను కొన‌సాగితే భార‌త జ‌ట్టు సెమీ ఫైన‌ల్లో తిరుగు ట‌పా ప‌ట్టేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఇక బౌలింగ్ విష‌యానికొస్తే.. బుమ్రా చ‌క్క‌టి బౌలింగ్‌తో మ్యాచును గెలిపించాడు. ఎప్ప‌టిలాగే ష‌మీ అధిక ప‌రుగుల‌ను స‌మ‌ర్పించుకున్నాడు. చాహ‌ల్ కూడా ఫ‌ర్వాలేద‌నిపించాడు. భువ‌నేశ్వ‌ర్ మెరుగ్గానే బౌలింగ్ చేశాడు. కీల‌క ఓవ‌ర్ల‌లో వైడ్లు వేయ‌డం భార‌త్‌కు ప్ర‌తికూలాంశం. మెరుగైన జ‌ట్ల‌తో ఆడేట‌ప్పుడు ప్ర‌తి ప‌రుగు కీల‌క‌మే కాబ‌ట్టి, ఇలాంటి తప్పిదాలు పున‌రావృతం కాకుండా జాగ్ర‌త్త‌ప‌డాల్సిన అవ‌స‌ర‌ముంది. ఇక బ్యాటింగ్‌లో కూడా త‌డ‌పాటు అస్స‌లు ప‌నికిరాదు. ఆస్ట్రేలియా మీద మొద‌టి మ్యాచులో ఎంత కసిగా ఆడారో.. స‌రిగ్గా అదే త‌ర‌హాలో భార‌త్ త‌దుప‌రి మ్యాచుల‌ను ఆడితే.. ఈసారి ప్ర‌పంచ క‌ప్ మ‌న‌మే గెలిచే అవ‌కాశ‌మున్న‌ది.

 

ICC WORLD CUP 2019 UPDATES, 

#indiancricketteam, #viratkohli, #indvban, #rishabhpant, #bumrah

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *