న్యూజిలాండ్ చిత్తు…టీమిండియా శుభారంభం

India beat New Zealand by 6 wickets

వరుస విజయాలతో జోరు మీదున్న టీంఇండియా మరో విజయన్ని సాధించింది..న్యూజిలాండ్ పర్యటనను టీమిండియా విజయంతో శుభారంభం చేసింది. ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ గ్రౌండ్ లో జరిగిన మొదటి T20 మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఆతిథ్యజట్టు న్యూజిలాండ్ ను చిత్తు చేసింది.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 20 ఓవర్లలో… 203/5 పరుగులు చేసింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన గుప్తిల్, మున్రో అద్భుతమైన ప్రతిభను కనబర్చారు. గుప్తిల్ 19 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌తో 30 పరుగులు చేయగా.. మున్రో రెండు సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 59 పరుగులు చేశాడు. అంతే కాకుండా కెప్టెన్ విలియమ్ సన్.. రాస్ టేలర్ పసందైన ఆటతో మన బౌలర్లకు చుక్కలు చూపించారు. విలియమ్ సన్ 27 బంతుల్లోనే.. నాలుగు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 51 పరుగులు చేశాడు. రాస్ టేలర్ కూడా 27 బంతుల్లో మూడు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 54 పరుగులు చేయడంతో.. కివీస్ 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత్ బౌలర్లు శార్దుల్ ఠాకూర్, జస్ప్రిట్ బుమ్రా, చాహల్, శివమ్ దూబే, జడేజాలు ఒక్కొక్క వికెట్లు తీశారు.

ఇక టీమిండియా విషయానికి వస్తే… 204 పరుగులు లక్ష్య చేధనతో బరిలోకి దిగిన భారత జట్టుకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ప్లేయర్ హిట్ మాన్ రోహిత్ శర్మ 7 పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్ లో అవుటయ్యాడు.. దీంతో అందరూ టెన్షన్ పడ్డారు. మ్యాచ్ ఆరంభంలోనే ఇది పెద్ద షాక్ అని చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన కోహ్లి (45) మరో ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌(56)తో కలిసి ఇన్నింగ్స్ ని చక్కదిద్దే పని పెట్టుకున్నడు, 2వీరిద్దరూ రెండో వికెట్‌కు గాను 98 పరుగుల భాగస్వామ్యం జోడించారు.ఆ తర్వాత ఇద్దరు 6 పరుగుల తేడాతో ఔటయ్యారు. ఈ క్రమంలో శ్రేయన్‌ అయ్యర్‌(58), మనీశ్‌ పాండే(14) చివరివరకు ఉండి జట్టును గెలిపించారు. అయితే శ్రేషన్ అయ్యర్ కేవలం 29బంతుల్లో 58పరుగులు చేసి ఇండియాను గెలిపించాడు. రెండో టి20 మ్యాచ్ ఇదే మైదానంలో జనవరి 26 ఆదివారం జరగనుంది.

India beat New Zealand by 6 wickets,India vs New Zealand 1st T20,#AUCKLAND, Shreyas Iyer, KL Rahul,Kohli,Rohith,Bharath,Kivis,five-match T20I series,2nd T20 On January 26th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *