విండీస్ ను మట్టి కరిపించిన ఇండియా

India Defeated Windies in Second Test

కింగ్ స్టన్ లో జరిగిన రెండో టెస్టు మ్యాచులో భారత్ జట్టు 257 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును మట్టి కరిపించింది. దీంతో, టెస్టు సీరిస్ ను కైవసం చేసుకుంది. అంతేకాదు, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ర్యాంకింగులోనూ పైస్థానానికి చేరుకుంది. విండీస్ మీద భారత్ వరుసగా సాధించిన ఎనిమిదో విజయం ఇది. రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులతో ఆట ప్రారంభించిన విండీస్ జట్టు 42 పరుగులను జోడించిన అనంతరం జడేజా చేస్ ను ఔట్ చేశాడు. హెట్మియర్ ను ఇషాంత్ ఔట్ చేయగా.. ఆ తర్వాత బ్రూక్స్, బ్లాక్ వుడ్ ధాటిగా ఆడుతుండగా బుమ్రా బ్లాక్ వుడ్ ని ఔట్ చేశాడు. అతను 38 పరుగుల వద్ద వికెట్ కీపర్ పంత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత బ్రూక్స్, హ్యామిల్టన్ లు ఔట్ కాగా విండీస్ జట్టు స్కోరు ఏడు వికెట్ల నష్టానికి 177కి చేరింది. ఇక, మహ్మద్ షమీ కార్న్ వాల్, రోచ్ లను ఔట్ చేయగా స్కోరు 206కు చేరింది. చివరగా జడేజా హోల్డర్ వికెట్ను పడగొట్టడంతో ఆతిథ్య జట్టు 210 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫలితంగా, భారత్ జట్టు భారీ తేడాతో విజయం సాధించింది.

India Series Against Windies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *