దేశానికి తాళం.. 14వరకు లాక్ డౌన్

INDIA LOCK DOWN

చాలామంది ఊహించిన విధంగానే ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశం మొత్తాన్ని 21 రోజులపాటు లాక్ డౌన్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంటి చుట్టూ లక్ష్మణరేఖ గీసుకుని అది దాటి బయటకు రావొద్దని స్పష్టంచేశారు. మంగళవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని, అందరూ దీనిని కచ్చితంగా పాటించాలని తేల్చిచెప్పారు. ప్రధానిగా కాకుండా మీ కుటుంబ సభ్యుడిగా చెబుతున్నానంటూ అభ్యర్థించారు. ప్రపంచాన్ని నిలువెల్లా వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఇంతకు మించిన దారి మరొకటి లేదన్నారు. చైనా, ఇటలీ, జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్ వంటి సాధికారత కలిగిన దేశాలు సైతం కరోనాను నివారించలేకపోయాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గమని స్పష్టంచేశారు. రాబోయే 21 రోజులు ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని పేర్కొన్నారు.

NATIONAL NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *