లాక్ డౌన్ 4 పై కేంద్రం మార్గదర్శకాలు

India LockDown 4.O

కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ రేపటితో ముగియనున్న విషయం తెలిసిందే. దీంతో నాలుగో దశ లాక్‌డౌన్‌ విధించి, మినహాయింపులకు సంబంధించిన వివరాలను ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వివరించనుంది. లాక్‌డౌన్ నూతన మార్గదర్శకాలను ఈ రోజు సాయంత్రం విడుదల చేయనుంది. దేశంలో కరోనా విజృంభణ అధికంగా ఉన్న రెడ్‌జోన్లలో తప్ప మిగతా ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థకు సడలింపులు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక, వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలకు మరిన్ని సడలింపులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

CentreLockdown4.0Guidelines

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *