మొదటి టెస్టులో భారత్ ఓటమి

INDIA LOST FIRST TEST

టీ 20 సీరిస్లో క్లీన్ స్వీప్ జరిగిన తర్వాత న్యూజిలాండ్ జట్టు తమ సత్తా చాటుతుండగా.. భారత జట్టు మాత్రం ఆ క్లీన్ స్వీప్ మత్తులో నుంచి ఇంకా బయట పడలేదనిపిస్తోంది. భారత జట్టు చేస్తున్న ప్రదర్శన చూస్తుంటే, టెస్టు సీరిస్ కూడా న్యూజిలాండ్ చేతిలో పెట్టేవిధంగానే ఉన్నారు.  ఎందుకంటే, భారత జట్టు పది వికెట్ల తేడాతో మొదటి టెస్టు మ్యాచును న్యూజిలాండ్ జట్టుకు అప్పగించింది. మొదటి టెస్టులో భారత్ చేతులెత్తేసింది. భారత జట్టు సమిష్ఠిగా ఈ మ్యాచులో ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగులో పూర్తి స్థాయిలో విఫలమైంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సీరిస్లో.. 1-0తో న్యూజిలాండ్ జట్టు ముందంజలో ఉన్నది. ఈ మ్యాచులో రెండు ఇన్నింగ్సుల్లో తొమ్మిది వికెట్లు తీసిన టిమ్ సౌథీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచుగా ఎంపికయ్యారు.

మొదట బ్యాటింగు చేసిన భారత జట్టు 165 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బ్యాటింగు చేసిన న్యూజిలాండ్ జట్టు 348 పరుగులు చేసింది. ఆతర్వాత రెండో ఇన్నింగ్సు ఆరంభించిన భారత జట్టు 191 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో రెండోసారి బ్యాటింగు ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు వికెట్టు నష్టపోకుండా తొమ్మిది పరుగులు చేసి మొదటి టెస్టు మ్యాచు గెలుచుకున్నది. న్యూజిలాండ్ జట్టు సారథి మొదటి టెస్టు మ్యాచులో బాధ్యతాయుతంగా ఆడి తమ జట్టును గెలుపులో కీలక పాత్ర పోషించారు. అతనికి రాస్ టేలర్, కైల్ జేమీసన్, గ్రాండ్ హోప్ మన్ తదితరులు బ్మాటింగులో రాణించడంతో 348 పరుగులు చేయగలిగారు.

INDIA NEW ZEALAND TEST SERIES

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *