శ్రీలంకను చిత్తుగా ఓడించిన టీమిండియా

India outclass Sri Lanka by 7 wickets

భారత్ శ్రీలంక మధ్య జరిగిన రెండో టి 20 మ్యాచ్ లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో భారత్ శ్రీలంకను చిత్తుగా ఓడించి విజయబావుట ఎగురవేసింది. ఇక ఈ మ్యాచ్ లో రాహుల్, సైనీ అద్భుతమైన ఆటను కనబర్చారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రెండు జట్లలో ఏ మాత్రం పోటీ కనబడలేదు. టీం ఇండియాకు లంక ఆటగాళ్లు ఏ మాత్రం పోటీ ఇవ్వలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్ ముందు శ్రీలంక మొక్కుబడిగా బరిలో దిగినట్లు స్పష్టమైంది. టీం ఇండియా ముందు లంక నిలబడలేక చతికిలబడింది. ఫలితంగా ఎలాంటి శ్రమ లేకుండా కోహ్లి సేన ఖాతాలో విజయం చేరింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఆటగాళ్లు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులతో సరిపెట్టారు. ఈ ఇన్నింగ్స్ లో . కుశాల్‌ పెరీరా 28 బంతుల్లో 34 పరుగులతో ఆకట్టుకున్నాడు నిజానికి శ్రీలంక తరుపున పెరారి స్కోర్ అత్యధికం. అనంతరం భారత్‌ బరిలోకి దిగిన టీం ఇండియా ఆటగాళ్లు సునాయాసంగా ఆడుతూ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 144 పరుగులతో శ్రీలంకపై విజయం సాధించారు. .ఈ ఇన్నింగ్స్ లో కేఎల్‌ రాహుల్‌ 32 బంతుల్లో 45 పరుగులతో చెలరేగిపోయాడు;, శ్రేయస్‌ అయ్యర్‌ 26 బంతుల్లో 34 పరుగులు చేశాడు ఇక శిఖర్‌ ధావన్‌ 29 బంతుల్లో 32 స్కోర్ చేసి ఆకట్టుకున్నాడు. అనంతరం టీం ఇండియా చిచ్చరపిడుగు కోహ్లి 17 బంతుల్లో 30 పరుగులతో నాటౌట్‌ గా నిలిచాడు ఇక మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో మూడో మ్యాచ్ శుక్రవారం పుణేలో జరుగుతుంది.

 India outclass Sri Lanka by 7 wickets,2nd T20 highlights,Sri Lanka vs India 2020 Live Scores,Virat Kohli,Team India First Won the Match In 2020,Team India Score,Sri Lanka Score

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *