భారత్ సూపర్ గెలుపు

India Won In Super Over

భారత్ మరోసారి చూడముచ్చటైన ప్రదర్శన చేసింది. న్యూజిలాండ్ ను వారి సొంత గడ్డ మీద ఓడించి టీ 20 సీరిస్ ను కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ సూపర్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో భారత్ విజయం సాధించింది. అసాధరణమైన ఇలాంటి మ్యాచులో గెలవడం ఈమధ్యకాలంలో లేదనే చెప్పాలి. మొదట్లో బ్యాటింగ్ బ‌రిలో దిగిన టీమిండియా నిర్ణీత‌ 20 ఓట‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. కివీస్ ముందు 180 పరుగుల లక్ష్యాన్ని అందించ‌గా.. రోహిత్ శర్మ(65), కెప్టెన్ విరాట్ కోహ్లీ(38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కివీస్ బౌలర్లలో బెన్నెట్ మూడు వికెట్లు తీసుకోగా, గ్రాండ్‌హోమ్, సాట్నర్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ప్లేయ‌ర్లు ముందు అంత‌గా బౌలింగ్ వెయ‌న‌ప్ప‌టికీ 10 ఓవ‌ర్ల త‌రువాత క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్‌తో టీమిండియా ప్లేయ‌ర్ల దూకుడుకు అడ్డుక‌ట్ట వేసే ప్ర‌య‌త్నం చేశారు. 96 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. రోహిత్ శర్మ65 ప‌రుగులు, కెప్టెన్ విరాట్ కోహ్లీ38 పరుగులు శ్రేయాస్ అయ్యర్17, పాండే14 నాటౌట్, జడేజా10 నాటౌట్ తో 179 పరుగులు చేశారు. దీంతో న్యూజిలాండ్ ల‌క్ష్యం 180. 180 పరుగులను చేజించిన న్యూజిలాండ్ ఒక్క పరుగు వద్ద ఆగిపోయింది. దీంతో సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. దీంతో, రోహిత్ చెలరేగిపోయాడు. భారత్ గెలిచింది.

India set New Zealand 180-run target to win 3rd T20,third T20 International at Seddon Park,India vs New Zealand,Recent Match Report,New Zealand vs India 3rd T20

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *