భారత్ బోణీ కొట్టింది

Spread the love

INDIA STARTS WITH WIN

  • తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై గెలుపు
  • సెంచరీతో కదం తొక్కిన రోహిత్ శర్మ

ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో టీమిండియా బోణీ చేసింది. సౌతాంప్టన్ లో జరిగిన తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సఫారీ జట్టు నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యాన్ని మరో 15 బంతులు మిగిలుండగానే నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ సెంచరీతో (144 బంతుల్లో 122 నాటౌట్) కదం తొక్కడంతో భారత విజయం సులభమైంది. రాహుల్‌(26), ధోని(34) కూడా తమ వంతు పాత్ర పోషించడంతో తొలి మ్యాచ్ లో భారత్ విజయ పతాకం ఎగరేసింది. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఓపెనర్లు ఆమ్లా(6), డికాక్‌(10) నిరాశపరచగా.. క్రిస్‌ మోరిస్‌(42) రాణించాడు. డుప్లెసిస్‌(38), ఫెహ్లుక్వోయో(34), డేవిడ్‌ మిల్లర్‌(31), డస్సెన్‌(22), రబడా(31 నాటౌట్‌) పర్వాలేదనిపించడంతో సఫారీ జట్టు గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. భారత బౌలర్లలో యజ్వేంద్ర చహల్‌ నాలుగు వికెట్లు తీయగా.. బుమ్రా, భువనేశ్వర్‌లు తలో రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్‌ యాదవ్‌కు వికెట్‌ దక్కింది.

SPORTS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *