భారత విజయ లక్ష్యం 273

Spread the love

INDIA TARGET 273 RUNS

  • చివరి వన్డేలో ఖవాజా సెంచరీ

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతున్న నిర్ణయాత్మక చివరి వన్డేలో ఆసీస్ జట్టు భారత్ కు 273 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారూలకు అద్భుతమైన ఆరంభం లభించింది. ఓపెనర్ ఖవాజా (100, 106 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్ లు) సెంచరీ చేయడంతో 272 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మరో ఓపెనర్ ఫించ్ (27)లో కలిసి తొలి వికెట్ కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఖవాజా.. హ్యాండ్స్ కోంబ్ (52)లో కలిసి రెండో వికెట్ కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో 33 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 175 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఆసీస్.. అనంతరం వడివడిగా వికెట్లు పోగొట్టుకోవడంతో స్కోర్ వేగం నెమ్మదించింది. స్టోయినిస్ (20), నాలుగో వన్డే హీరో టర్నర్ (20) కూడా తక్కువ స్కోర్ కే ఔటయ్యారు. ఓ దశలో 300 పరుగులు దాటడం ఖాయంగా కనిపించింది. అయితే, భారత బౌలర్లు గాడిలో పడి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం.. ఫీల్డింగ్ కూడా కాస్త మెరుడుపడటంతో 255 నుంచి 260 పరుగుల స్కోర్ చేయగలుగుతుందని అంచనాలు వేశారు. అయితే చివర్లో రిచర్డ్ సన్ 29 (21 బంతుల్లో), కమిన్స్ 15 (8 బంతుల్లో) బ్యాట్ ఝలిపించడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ మూడు వికెట్లు తీయగా.. షమీ, జడేజాలు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. (టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆసీస్)

SPORTS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *