మూడో వికెట్ కోల్పోయిన భారత్

India vs New Zealand LIVE Score

టీ20 తర్వాత న్యూజిలాండ్‌, భారత్ హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌ వేదికగా మొదటి వన్డే ఆడుతుంది. టీ20 లో స్వీప్ చేసిన భారత్ ఈ వన్డేలోను రాణించాలనుకుంటుంది. అయితే ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్ టామ్‌ లాథమ్‌ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మేరకు బ్యాటింగ్ బరిలో దిగిన టీమిండియా అద్భుతంగ ఆడుతుంది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి హాఫ్‌ సెంచరీ సాధించాడు.  ఓపెనర్‌ పృథ్వీషా20 పరుగుల వద్ద ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి సూపర్ బ్యాటింగ్ తో రాణించాడు. అర్థ శతకం నమోదు చేశాడు. 61 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్‌ సెంచరీ చేశాడు. శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి 102 పరుగుల భాగస్వామ్యాన్ని కోహ్లి నెలకొల్పాడు. కాగా, హాఫ్‌ సెంచరీ చేసిన వెంటనే కోహ్లి పెవిలియన్‌ చేరాడు. ఇష్‌ సోథీ వేసిన 29 ఓవర్‌ నాల్గో బంతికి కోహ్లి బౌల్డ్‌ అయ్యాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతి కోహ్లి బ్యాట్‌ను దాటుకుని వెళ్లి వికెట్లను తాకింది.   దాంతో భారత స్కోరు 156 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. మరోవైపు గాయం కారణంగా రోహిత్ శర్మ దూరం అయ్యాడు. టీ20 సిరీస్ ని 5-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి ఆత్మవిశ్వాసం తో ఉన్న టీం ఇండియా వన్డే సిరీస్ లోనూ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఇక మయాంక్‌ అగర్వాల్‌32; 31 బంతుల్లో 6 ఫోర్లతో పసందైన ఆటను కనబర్చాడు. అతడు ఈ వన్డేలో రెండో వికెట్‌గా ఔట్‌ కాగా, కోహ్లికి అయ్యర్‌ జత కలిశాడు. వీరిద్దరూ బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. ఫోర్ల కంటే కూడా సింగిల్స్‌, డబుల్స్‌పైనే దృష్టి పెట్టి రన్‌రేట్‌ కాపాడుకుంటూ వచ్చారు. కాగా, ఊహించని బంతిని సోథీ వేయడంతో కోహ్లి ఇన్నింగ్స్‌ అవుట్ అయ్యాడు. అయితే . కోహ్లిని ఔట్‌ చేయడంతో న్యూజిలాండ్‌ కి కొంత ఉపశమనంగా మారింది. కోహ్లి ఔటైన తర్వాత అయ్యర్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయ్యర్‌ 66 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్‌ సెంచరీ చేశాడు.

Kohli Out At 50,India vs New Zealand 1st ODI Live Score Updates,Shreyas,NZ vs IND Live,Match Preview,Mayank Agarwal,bowled to get rid of Kohli

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *