నేడు భారత్‌ – శ్రీలంక మధ్య చివరి టి20

India vs Sri Lanka 3rd T20I 2020
నేడు భారత్‌ – శ్రీలంక మధ్య పుణే వేదికగా చివరి టి20 మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే టీం ఇండియా ఆధిక్యంలో ఉండగా మూడవ మ్యాచ్ గెలిచి క్లిన్ స్వీప్ చేసేందుకు సిద్ధమైంది. భారత్‌ – శ్రీలంక మధ్య జరిగిన రెండవ టి20 మ్యాచ్‌ లో భారత్ శ్రీలంకను చిత్తుగా ఓడించింది. కనీస పోటీ కూడా ఇవ్వని శ్రీలంక మూడవ టి20 మ్యాచ్ లోనైనా గెలిచేందుకు కష్టపడుతుంది. మూడు టీ20ల ఈ సిరీస్‌కి సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మకి విశ్రాంతినిచ్చిన భారత సెలక్టర్లు.. గాయం నుంచి ఇటీవల కోలుకున్న శిఖర్ ధావన్‌కి ఛాన్సిచ్చారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనిస్తే ఇప్పటి వరకూ 16 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌ – శ్రీలంక జట్లూ తలపడగా.. ఇందులో భారత్ జట్టు ఏకంగా 11 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మొత్తంగా శ్రీలంకపై టి20 సిరీస్ లో టీమిండియాదే పైచేయి.

India vs Sri Lanka 3rd T20I 2020,India vs Sri Lanka 3rd Match Prediction,Team India,Sri Lanka,third and final match in Pune on Friday,India and Sri Lanka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *