కోహ్లీ సెంచరీ.. చివరి వన్డే మనదే

Spread the love

INDIA WON LAST ODI

వెస్టిండీస్ తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. కెప్టెన్ కోహ్లీ(99 బంతుల్లో 114 నాటౌట్) సెంచరీ చేయడంతో ఆతిథ్య జట్టుపై భారత జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. వర్షం కారణంగా 35 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో భారత విజయ లక్ష్యాన్ని 255గా నిర్దేశించారు. ఇంకా 15 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా 256 పరుగులు చేసి గెలుపు సొంతం చేసుకుంది. అంతకుముందు టాస్ గెలిచిన విండీస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత బౌలర్లను ఎదుర్కొవడానికి తీవ్రంగా ఇబ్బంది పడిన గేల్‌.. ఆఖరి మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఒకవైపు గేల్, మరోవైపు లూయిస్ విరుచుకుపడటంతో విండీస్ స్కోర్ ఉరకలెత్తింది. ఇరువురూ పోటీపడి ఆడటంతో 10 ఓవర్లలోనే విండీస్ 114 పరుగులు చేసింది. ఈ క్రమంలో 11వ ఓవర్లో లూయిస్ ను (29 బంతుల్లో 43) చాహల్ పెవిలియన్ పంపించాడు. తర్వాతి ఓవర్లోనే గేల్ (41 బంతుల్లో 72) కూడా ఔట్ అయ్యాడు. అనంతరం హెట్‌మైయర్‌(25), షై హోప్‌(24) జాగ్రత్తగా ఆడారు.

అయితే, ఇన్నింగ్స్‌ 22వ ఓవర్‌లో వర్షం మొదలైంది. దాదాపు రెండు గంటల ఆట తుడిచిపెట్టుకుపోవడంతో మ్యాచ్ ను 35 ఓవర్లకు కుదిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత పిచ్ బౌలర్లకు సహకరించడంతో భారత బౌలర్లు దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. మిగిలిన బ్యాట్స్ మెన్ ఎవరినీ నిలదొక్కుకోకుండా వచ్చినవారిని వచ్చినట్టే పెవిలియన్ పంపించారు. ఫలితంగా చివరి ఐదు ఓవర్లలో విండీస్ మూడు వికెట్లు కోల్పోయి 29 పరుగులు మాత్రమే చేసింది. మొత్తమ్మీద 35 ఓవ్లలో 7 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఖలీల్ మూడు‌, షమి రెండు వికెట్లు పడగొట్టారు. అయితే డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం భారత్‌ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 255 పరుగులుగా నిర్దేశించారు.

ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. జట్టు స్కోరు 25 ఉన్నప్పుడు రోహిత్ శర్మ (10) ఔట్ అయ్యాడు. మరోవైపు ధావన్ తన ఇన్నింగ్స్ ను ధాటిగానే ప్రారంభించాడు. అతడికి కోహ్లీ జత కలవడంతో ఇరువురూ కలిసి స్కోర్ బోర్డు ను పరిగెత్తించారు. 91 పరుగుల వద్ద ధావన్ (36 బంతుల్లో 36) పెవిలియన్ చేరగా.. ఈ వెంటనే రిషబ్ పంత్ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. ఈ దశలో బ్యాటింగ్ కు దిగిన శ్రేయాస్ అయ్యర్(41 బంతుల్లో 65) యధేచ్ఛగా బ్యాట్ ఝలిపించాడు. కోహ్లీ ( 86 బంతుల్లో 89 నాటౌట్)తో కలిసి నాలుగో వికెట్ కు 120 పరుగులు జోడించాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని రోచ్ విడదీశాడు. లాంగాన్ లో హోల్డర్ కి సింపుల్ క్యాచ్ ఇచ్చి అయ్యర్ పెవిలియన్ చేరాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కేదర్ జాదవ్ (12 బంతుల్లో 19 నాటౌట్) తో కలిసి కోహ్లీ లాంఛనం పూర్తిచేశాడు.

SPORTS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *