కొత్త‌గా 32 రైళ్లు అద‌నం..

18

Indian Railways to start 32 new trains

గురువారం నుంచి మరో 32 జతల రైళ్లు అదనంగా నడుస్తున్నాయి. కోవిడ్ టైం లో నడిచే రైళ్లు కొన్ని పొడిగించారు. దాదాపు 186 రైళ్లు సికింద్రాబాద్ జోన్ నుంచి రాక‌పోక‌ల్ని సాగిస్తున్నాయి. కేవలం సికింద్రాబాద్ నుంచి వెళ్లే రైళ్ల సంఖ్య దాదాపు డెబ్బ‌య్ ఐదు దాకా ఉన్నాయి. మొత్తం 261 రైళ్లు పునరుద్ధరించారు. నిజానికి, కోవిడ్ ముందు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 296 రైళ్లు నడిచేవి. ప్రయాణికుల భద్రత,రక్షణ పరంగా ప్రస్తుతం రిజర్వేషన్ తరహాలోనే నడుస్తున్నాయి. ప్రయాణికులు కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే. మాస్క్ ధరించటం తో పాటు ప్లాట్ ఫార్మ్ పై భౌతిక దూరం పాటించాలి. రిజర్వేషన్ కంఫర్మ్ టికెట్ ఉన్నవాళ్లు మాత్రమే స్టేషన్ లోకి అనుమతిస్తామ‌ని అధికారులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here