అయోధ్య తీర్పు పై షియా బోర్డు పిటిషన్

interesting news in Ayodhya verdict
అయోధ్య కేసులో తుది తీర్పు నేపథ్యంలో  ఉత్కంఠ నెలకొంది.  తుది తీర్పును  చీఫ్ జస్టీస్ రంజన్ గొగోయ్ చదువుతున్నారు.  ఇది తీర్పు కాపీని చదవడానికి అరగంట సమయం పట్టే అవకాశం ఉంది. వివాదాస్పద భూమి తమదేనంటూ దాఖలైన షియా బోర్డు పిటిషన్ కొట్టివేసింది న్యాయస్థానం. మసీదును బాబర్ నిర్మించాడనే దానిని  తాము సమర్థిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.  బాబ్రీ మసీదు  సున్నీ వక్ఫ్ బోర్డు  1946లో ట్రయల్ కోర్టు రూలింగ్ ఇచ్చింది. ఆ మసీదును సున్నీ అయిన  బాబరు నిర్ణయించలేదని, ఆయన కమాండర్ నిర్మించారని  షియా బోర్డు  పిటిషన్ దాఖలు చేసింది.  అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.  బాబ్రీ మసీదును బాబరు  నిర్మించ లేదనేది  షియా  బోర్డు వాదన.  అయితే కోర్టు  షియా బోర్డు పిటిషన్  కొట్టివేసింది.  ప్రజల  విశ్వాసాలను, నమ్మకాల్ని గౌరవిస్తున్నామని తెలిపింది.
మరోవైపు నిర్మాహి అఖాడా పిటిషన్‌ను కూడా కొట్టివేసింది ధర్మాసనం. హక్కుల విషయంలో నిర్మోహ అఖాడా వాదన కూడా  సరైన వాదన కాదని పేర్కొంది. దీంతో పాటు అక్కడ దేవాలయాన్ని కూడా ధ్వంసం చేశారనడానికి పురావస్తు శాఖ ఆధారాల్లేవని న్యాయస్థానం  తెలిపింది. బాబ్రీ మసీదును కూడా ఖాళీ స్థలంలో నిర్మించలేదని  సుప్రీం ధర్మాసనం తెలిపింది. అక్కడ గతంలో ఓ పెద్ద కట్టడం  ఉండేదని ఆర్కియాలజీ  డిపార్ట్మెంట్  తెలియజేసిందని కోర్టు పేర్కొంది. నమ్మకం విశ్వాసాల ఆధారంగా స్థల యజమానిని నిర్ణయించలేమని  పేర్కొంది. చట్టబద్దత ఆధారంగానే దాని నిర్ణయం జరుగుతుందని సుప్రీంకోర్టు  అభిప్రాయపడింది. అయోధ్యకు సంబంధించి నిర్మోహి అఖాడా‌ పిటిషన్‌ను ఆర్టికల్ 120 ప్రకారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ వివాదాస్పద భూమికి సంబంధించి నిర్మోహి అఖాడా  యజమాని కాదని స్పష్టం చేసింది.
tags : Ayodhya verdict, Supreme Court, central government,  Ranjan Gogoi, Chief justice of india, shiya board petition, nirmohi akhada petition, dismissed
http://tsnews.tv/ayodhya-verdict-social-media-posts-ban/
http://tsnews.tv/today-ayodhya-verdict/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *