ఇంటింటా ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్

INTINTAINNOVATOR EXHIBITION

తెలంగాణాలో ఆవిష్కరణల సంస్కృతికి ప్రోత్సాహం ఇవ్వడానికి రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్ ను ఆగష్టు 15 వ తేదీన ప్రారంబిస్తున్నారు. ఆసక్తి గల వారు తమ తమ సొంత జిల్లాల్లో వారి ఆవిష్కరణలను ప్రదర్శించడానికి ఇది ఒక చక్కటి అవకాశం.

తెలంగాణ ప్రభుత్వ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (TSIC) ఒక నెల క్రితం ప్రారంభించిన ఈ కార్యక్రమానికి మొత్తం 500 అప్లికేషన్లు రావడం జరిగింది. అందులో 360 ప్రదర్శనకు అర్హత సాధించడం జరిగింది మరియు 220 షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. గ్రామీణ స్థాయి ఆవిష్కరణల నుండి సాంకేతిక స్థాయి వరకు అన్ని విభాగాలకు చెందిన ఆవిష్కరణలు ఇందులో చోటు చేసుకున్నాయి. 6 ఆవిష్కరణలు స్టార్ట్ అప్ లుగా ఎంపిక చేయడం జరిగింది.

తెలంగాణ ప్రభుత్వ ITE&C ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆవిష్కరణల సమాహారం ఈ స్వాతంత్య్ర దినోత్సవానికి సరికొత్త శక్తిని ఇవ్వాలని ఆకాంక్షిస్తూ, యువకులు, వృద్దులు, రైతులు మరియు సాంకేతిక నిపుణులు ఒకే వేదికను పంచుకోనున్నట్లు తెలిపారు. పౌరులంతా పెద్ద సంఖ్యలో ఈ ఎగ్జిబిషన్ లను సందర్శించి ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆవిష్కర్తల విషయానికి రాగానే సాధారణంగా పెద్ద పెద్ద చదువులు చదివిన సైంటిస్ట్ ల గురించి ఆలోచిస్తాం. కానీ ఎవరయినా ఆవిష్కర్తలు కావచ్చు. స్కూల్ చదువు పూర్తి చేయని వారు సైతం ఆవిషర్తలుగా మారడానికి అవకాశం ఉంది. గత సంవత్సరంన్నర కాలంగా TSIC ఎంతో మంది ఇలాంటి ఇన్నోవేటర్లను కలుసుకోవడం జరిగింది. ఈ ఆగష్టు 15 వ తేదీ ఎగ్జిబిషన్ సందర్భంగా తెలంగాణ లో ఉన్నఅలాంటి ఇన్నోవేటర్ లను కలుసుకునే అవకాశం ప్రతీ ఒక్కరికీ కల్పిస్తుంది. ఈ చొరవ ఇన్నోవేటర్ గా మారాలనుకునే వ్యక్తి ఉన్నత చదువులే చదువుకొని ఉండాలనే భ్రమ తొలగిస్తుందని ఆశిస్తున్నాం. ప్రతీ ఒక్కరినీ ఆవిష్కరణల వైపు ప్రోత్సహించడానికి మరింత అవకాశం కలుగుతుంది. ప్రతీ ఒక్కరు కుటుంబ సభ్యులతో కలిసి తమ తమ జిల్లాల్లోని ఎగ్జిబిషన్ ను సందర్శించాలని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ ఫణీంద్ర సామ విజ్ఞప్తి చేశారు.

అన్ని జిల్లాల నుండి ఆవిష్కర్తలు స్థానికంగా రోజువారీగా ఎదుర్కుంటున్న సమస్యలను గుర్తించారు. మరియు వారి ఆవిష్కరణల కోసం స్థిరమైన పరిష్కార మార్గాలను గుర్తించారు. గత వారంలో అప్లికేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది, జగిత్యాల, మేడ్చల్-మల్కాజ్గిరి, ఖమ్మం, నిర్మల్, పెద్దపల్లి మరియు హైదరాబాద్ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో (షార్ట్ – లిస్ట్ జాబితా ఆవిష్కరణలు) వస్తున్నాయి.

33 జిల్లాలకు చెందిన జిల్లాల పరిపాలనా విభాగం స్థానికంగా, క్షేత్ర స్థాయిలో ఉన్న ఆవిష్కర్తలను ప్రోత్సహించడానికి స్వయంగా భాద్యత తీసుకుంటుంది. రాష్ట్ర పరిధిలో ఆవిష్కర్తల ఆలోచనలను, ఆవిష్కరణలను అన్ని విధాలుగా విస్తృతం చేయడానికి ఒక వేదికను ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర అభివృద్ధి సూచికలో ఆవిష్కరణలు ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఇంటింటా ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్ కార్యక్రమం స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ జిల్లాలో ప్రారంభం అవుతుంది.

Related posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *