ఐఫోన్ 11.. సెప్టెంబరు 10న విడుదల

iPhone 11 Launch on September 10th

మొబైల్ ఫోన్ల విభాగంలో సరికొత్త సంచలనం రేకెత్తిస్తున్న యాపిల్ సంస్థ కొత్త ప్రకటన చేసింది. సెప్టెంబరు 10వ తేదీన ఒక కీలకమైన నిర్ణయాన్ని వెలువరించనుంది. అదేమిటో కాదు.. ఇప్పటివరకూ పది వర్షన్లతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది వినియోగదారుల మన్ననలను పొందిన యాపిల్ సంస్థ.. ఈ ఏడాదిలోనే అతిపెద్ద ఈవెంట్ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకీ, ఆ ప్రకటన సారాశం గురించి ఫోర్బ్స్ తన అంచనాలను వెల్లడించింది. సెప్టెంబరు 10న యాపిల్ సంస్థ తమ ఐఫోన్ 11వ ఎడిషన్ ను ప్రారంభిస్తున్నట్లు అంచనా వేస్తోంది. ఇదే, యాపిల్ సంస్థ ప్రపంచ ఫోనుప్రియులకు అందిస్తున్న కానుకగా అభివర్ణించింది. ఇప్పటికే యాపిల్ ఫోన్ కు ప్రపంచవ్యాప్తంగా గల గుర్తింపు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అసలు యాపిల్ ఫోన్ ను జీవితంలో ఒక్కసారైనా వినియోగించాలని కోరుకునేవారి సంఖ్య ప్రపంచంలో లక్షల మంది ఉన్నారు. అలాంటి వారందరి కోసం ఇప్పటికే పలు మోడళ్లను సిద్ధం చేసిన యాపిల్.. తాజాగా పదకొండో ఎడిషన్ను విడుదల చేయటం పట్ల సర్వత్రా ఆశ్చర్యం నెలకొన్నది. యాపిల్ ఐఫోన్ 11వ ఎడిషన్ గురించి ఇప్పటికే నెటిజన్లు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. అది మార్కెట్లోకి రాగానే ఎన్ని వేల ఫోన్లు అమ్ముడవుతాయోననే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది.

#Apple Latest Updates

#Iphone11thEdition

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *