Ipl 2020
కరోనా క్రికెట్ కు కూడా విరామం ఇచ్చింది. స్టేడియంలో క్రికెటర్ల సందడి లేక చాలా రోజులవుతంది. క్రికెట్ ఫ్యాన్స్ కూడా చేసేది లేక పాత మ్యాచ్ లను చూస్తూ, గల్లీ ఆటలు ఆడుకుంటూ సరదా తీర్చుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే అన్నిగాడిన పడుతుంటడంతో మళ్లీ క్రికెట్ కు మంచి రోజులు వచ్చాయి. మళ్లీ ఆట మొదలు కానుంది ఐపీఎల్ రూపంలో…
ఈనెల 19 నుంచి ఐపీ ఎల్ సందడి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయా జట్లు కప్ గెలిచేందుకు నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఎలాగైనా కప్ అందుకోవాలని శ్రమిస్తున్నాయి. కొంతమంది క్రికెటర్లు కరోనాను జయించి స్టేడియంలో అడుగు పెట్టనున్నారు. త్వరలోనే ఫ్యాన్స్ ను అలరించనున్నారు. నాలుగు రోజుల్లో ఐపీ ఎల్ స్టార్ కానుంది. అభిమానులు ఎంచక్కా ఇంట్లో కూర్చొని ఐపీఎల్ ను చూసేయండి మరి. చాలా సార్లు కప్ కు అందనంత దూరంలో ఉన్న కోహ్లీ సేన.. ఈ సారి ఎలాగైనా కప్ ను ముద్దాడాలని గట్టిగా ఉంది. కోహ్లీ రెచ్చిపోతే ఇక అభిమానులకే పండుగే.