బాలీవుడ్ స్టార్లు.. టాలీవుడ్ కు దారి చూపుతారా?

Is bollywood halls open?

బాలీవుడ్.. భారీ సినిమాలకు పెట్టింది పేరు. అక్కడ కాస్ట్ కు తగ్గట్టుగానే కలెక్షన్స్ వస్తాయి. అలాగే ఏ మాత్రం తేడా వచ్చినా లాస్ లు కూడా అదే రేంజ్ లో ఉంటాయి అనేది అందరికీ తెలుసు. అయితే కొన్నాళ్లుగా లాక్ డౌన్ కారణంగా.. ప్రపంచ సినిమా అంతా స్తంభించిపోయింది. హాలీవుడ్ లో జూలై నెల చివరి నుంచి థియేటర్స్ ఓపెన్ అవుతాయి అంటున్నారు. అయితే ఇండియాలో అంత తొందరగా ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదు. అందుకే ఇప్పటికే పూర్తయిపోయి.. విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ సినిమాలన్నీ థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని ఈగర్ గా చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో రూపొందిన ఓ రెండు భారీ సినిమాలు మాత్రం కొత్త స్టెప్ కు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి అంటున్నారు. ఆ స్టెప్ సక్సెస్ అయినా కాకపోయినా.. బిజినెస్ రేంజ్ ను బట్టి చూస్తే అది సౌత్ లోనూ కొత్త దారి చూపుతుందేమో అనిపిస్తోంది. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ నటించిన ఊరమాస్ ఎంటర్టైనర్ ‘సూర్యవంశీ’. అక్కీ భాయ్ పోలీస్ పాత్రలో నటించాడు. ఈ మూవీ సమ్మర్ లో రావాల్సింది. రాలేకపోయింది. అలాగే అతనే నటించిన మరో సినిమా లక్ష్మీ బాంబ్. లారెన్స్ హీరోగా నటించి డైరెక్ట్ చేసిన కాంచనకు రీమేక్ ఇది. అక్కడ కూడా లారెన్సే డైరెక్ట్ చేశాడు. ఈ చిత్రాన్ని ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల చేస్తారు అనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే విడుదలవుతుందని కూడా ఖచ్చితంగా వినిపిస్తోంది. ఇక అక్షయ్ తో పాటు మరో స్టార్ రణ్ వీర్ సింగ్ నటించిన బయోపిక్ ‘83’.

1983లో భారత్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో కపిల్ దేవ్ సెంటర్ పాయింట్ గా వస్తోన్న సినిమా ఇది. భారీ బడ్జెట్ తో పాటు భారీ స్టార్ కాస్టింగ్ కూడా ఉంది. ఈ సినిమాను కూడా ఓటిటిలో విడుదల చేయాలునుకుంటున్నారు. అయితే సూర్యవంశీ, 83 సినిమాలకు డిస్నీ సంస్థ నుంచి భారీ డీల్ వచ్చిందట. ఆ డీల్ ఎగ్జైటింగ్ గా ఉండటంతో వీళ్లు డిజిటల్ స్ట్రీమింగ్ కు ఓకే చెప్పాలనుకుంటున్నారని సమాచారం. అదే టైమ్ లో థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత చిత్రాలు విడుదలవుతాయి. అంటే ఇటూ అటూ రెండు రకాలుగా లాభం. కాకపోతే ఆ లాభం డిస్నీ సంస్థకు ఉంటుంది. అలాగే ఇప్పుడు అమ్మేసుకున్న నిర్మాత సైతం నష్టాలు లేకుండానే సేఫ్ అవుతాడు. ఈ ప్లాప్ ఏదో బావుంది కదూ. ఇక ఇది వర్కవుట్ అయితే తెలుగుతో పాటు సౌత్ మూవీస్ కూడా ఈ రూట్ లోకి వెళ్లేందుకు దైర్యం చేస్తాయి. కాకపోతే కంటెంట్ ప్రధానం. అయితే తమిళ్, మళయాలంలో ఇప్పుడు స్టార్ హీరోలు నటించిన భారీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ తెలుగులో మాత్రం పెద్ద స్టార్స్ సినిమాలేవీ లేవు.  అయినా నాని, సాయితేజ్, రామ్ వంటి హీరోలకు ఇదో బెస్ట్ ఆప్షన్ అవుతుందనే చెప్పాలి. చూద్దాం.. బాలీవుడ్ రూట్ లో టాలీవుడ్ నుంచి ఎవరు ముందుగా ముందుకు వస్తారో.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *