పూరితో మహేశ్ సినిమా చెప్తాడా..?

6
Is Mahesh greensignal to puri?
Is Mahesh greensignal to puri?

Is Mahesh greensignal to puri?

‘ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతదో… వాడే పండుగాడు’ అనే డైలాగ్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. మాస్ డైలాగ్స్, హీరోయిజం ఉంది కాబట్టే పోకిరి మూవీ ఇండస్ర్టీ హిట్ గా నిలిచింది. దాంతో సూపర్‌స్టార్ మహేష్, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌ అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతో క్రేజ్ ఏర్పడింది. బిజినెస్ మేన్ మూవీ కూడా హిట్ కావడంతో వీరిద్దరి కాంబినేషన్ కు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత మరే సినిమా రాలేదు. కేవలం మహేశ్ కోసమే పూరి `జనగణమణ`ను రెడీ చేశాడు. ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో కొంతకాలం గ్యాప్ వచ్చింది. మహేశ్ డేట్స్ ఇవ్వడం లేదని పూరి బహటంగానే చెప్పేశాడు. మహేశ్ ఫ్యాన్స్ కూడా పూరితో సినిమా చేయాలని కలలు కంటున్నారు.

ఇదిలా ఉండగా పూరీ జగన్నాథ్ బర్త్ డే ఇవాళ. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా పూరీకి మహేష్ విషెస్ చెప్పాడు. `నా అభిమాన డైరెక్టర్లలో ఒకరైన పూరీ జగన్నాథ్‌గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ సంతోషంగా, విజయోత్సాహంతో ఉండాలని కోరుకుంటున్నా` అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పటికైనా వీరి కాంబినేషన్ సినిమా తెరకెక్కెనా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.