పూరీ జగన్నాథ్ ‘ముంబై టార్గెట్’ రీచ్ అయ్యాడా..?

Is Puri reached target?

తెలుగులో డాషిండ్ డైరెక్టర్ గా తిరుగులేని ఉంది పూరీ జగన్నాథ్ కి. మాటలతో మాయ చేయడంలో పూరీని మించిన వారు లేరు. అతని మాటల్లో వేదాంతం నుంచి వల్గారిటీ వరకూ కనిపిస్తుంది. నెగెటివ్ హీరోయిజం పేరుతో తెలుగు సినిమాకే ఓ తెగులుపుట్టించి.. మిగతా దర్శకులనూ ఆ బాట పట్టించిన ప్రతిభ పూరీ సొంతం.  కొన్నాళ్ల క్రితం అతను కూడా తన గురువు రామ్ గోపాల్ వర్మ లా బాలీవుడ్  కు వెళ్లాలని ప్రయత్నించాడు. తనే తీసిన మూణ్నాలుగు తెలుగు సినిమాలను కిచిడీ చేసిన అమితాబ్ బచ్చన్ తో ‘బుడ్డాహోగా తేరా బాప్’ అని తీశాడు. ఎప్పట్లానే విమర్శలు వచ్చినా కమర్షియల్ గా ఓకే అనిపించుకుందా సినిమా. బట్.. అతనికి బాలీవుడ్ లో ఏ పేరూ తేలేదు. అన్నట్టు ఈ మూవీలో ఛార్మీ ఓ ప్రధాన పాత్రలో నటించడం విశేషం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఓ ప్యాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. ఓ షెడ్యూల్ కూడా మొదలైంది. మొదట్లో తెలుగు వరకే అనుకున్నా.. కరణ్ జోహార్ ఎంట్రీతో ఇది ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా మారింది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత వస్తోన్న సినిమా కాబట్టి ఈ మూవీపై అంచనాలున్నాయి.

అయితే కొన్నాళ్లుగా పూరీ జగన్నాథ్ ఎవరికీ కనిపించడం లేదు. దీంతో లాక్ డౌన్ కదా ఇంట్లో ఉన్నాడేమో అనుకున్నారు. ఇంట్లోనే ఉన్నాడు. కానీ హైదరాబాద్ లో కాదు. ముంబైలో. యస్.. లాక్ డౌన్ అంతా పూరీ ముంబైలోనే ఉండిపోయాడు. ఈ కారణంగానే హైదరాబాద్ లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి జరుగుతోన్న ఏ సమావేశాల్లోనూ కనిపించడం లేదు పూరీ.  మరి ఇన్ని రోజులుగా అక్కడ ఫైటర్ కు సంబంధించిన పనులు చూసుకుంటున్నాడు అనుకున్నారు. అందులో కొంత నిజం ఉన్నా.. మరోవైపు అక్కడే మకాం వేసేందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభించాడట. అందులో నుంచి కొంత వరకూ సక్సెస్ అయ్యాడు అనే టాక్స్ వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా కరణ్ జోహార్ తో మరో ప్రాజెక్ట్ సెట్ అయినట్టు సమాచారం. అంటే విజయ్ దేవరకొండతో చేస్తోన్న సినిమా అయిపోగానే మళ్లీ పూరీ డైరెక్షన్ లోనే కరణ్ జోహార్ మరో సినిమా చేస్తాడు. ఇది కూడా ప్యాన్ ఇండియన్ లెవెల్లోనే ఉంటుందట. అంటే విజయ్ తో చేస్తోన్న ఫైటర్ స్క్రీప్ట్ పై నమ్మకంతో పాటు తర్వాతి కథపై కాన్ఫిడెన్స్ కూడా కరణ్ కు ఈ ధైర్యం ఇచ్చి ఉండొచ్చు. అంటే ఫైటర్ హిట్ అయితే తర్వాతి ప్రాజెక్ట్ కు డబుల్ బెన్ ఫిట్ అవుతుంది. లేదా ఫైటర్ అనుకున్నంత ఆడకపోతే తర్వాతి కథ నచ్చింది కాబట్టి.. దాంతో ఈ లాస్ లు రికవర్ చేసుకోవచ్చు. (మరి అది కూడా పోతే అంటారేమో.. అలాంటివి అస్సలు పట్టించుకోదు ఇండస్ట్రీ) ఏదేమైనా పూరీ జగన్నాథ్ ముంబై టార్గెట్ రీచ్ అయినట్టుగానే చెప్పాలేమో.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *