కన్నడ స్టార్ నూ వదలని రాజమౌళి

Is Sudeep Acts In RRR?

రాజమౌళి.. ఇండియాస్ టాప్ డైరెక్టర్ గా వెలుగుతోన్న దర్శకుడు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ తో రాబోతున్నాడు. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ ల కలయిక అనే ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ఇది. మధ్యలో భగత్ సింగ్ పాత్ర కూడా ఎంటర్ అవుతుంది. గెస్ట్ రోల్ లా కనిపించే ఆ పాత్ర కోసం అజయ్ దేవ్ గణ్ ను తీసుకున్నాడు. అలియా భట్ తో పాటు ఓ ఇంగ్లీష్ భామ ఒలీవియా మారిసన్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో కన్నడ టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సముద్రఖని ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇక లేటెస్ట్ గా ఈ మూవీలో మరో  కీలక పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో సుదీప్ ను కూడా తీసుకుంటున్నాడట రాజమౌళి. గతంలో సుదీప్ కు లైఫ్ టైమ్ బెస్ట్ అనిపించేలా ఈగ సినిమాలో విలన్ పాత్ర ఇచ్చాడు జక్కన్న. తర్వాత బాహుబలిలోనూ ఓ కేమియో అప్పీరియన్స్ ఇప్పించాడు. మంచి నటుడుగా పేరు తెచ్చుకున్న సుదీప్ పాత్ర ఏంటనేది ఇంకా తెలియలేదు కానీ.. అతనికోసం ప్రత్యేకంగా రాసిన సీన్స్ తోనే తీసుకుంటున్నాడట. మొత్తంగా ఇప్పటి వరకూ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయకుండా దాచేస్తూ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న రాజమౌళి.. సినిమాను మాన్ సూన్ స్పెషల్ గా జూలై 30న విడుదల చేయబోతున్నాడు.

Is Sudeep Acts In RRR?,sudeep in rrr movie,Sudeep In Rajamouli’s RRR,#RRR,#Rajamouli,#Sudeep,NTR,Ram Charan,Ajay Devagan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *