మాజీ ఎంపీ కవిత కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం

ISB Invites Kalvakuntla Kavitha

*ఐఎస్ బీ లో జనవరిలో ఇండియన్ డెమక్రసీ ఎట్ వర్క్” సదస్సు

* మనీ పవర్ ఇన్ పాలిటిక్స్” అంశంపై ప్రసంగించనున్న మాజీ ఎంపీ కవిత

*హాజరు కానున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, వివిధ రంగాల ప్రతినిధులు

మాజీ ఎంపీ‌ కవిత కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం లభించింది. హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరగనున్న “ఇండియన్ డెమక్రసీ ఎట్ వర్క్” సదస్సులో పాల్గొనాల్సిందిగా నిర్వాహకులు ఆహ్వానించారు. 2020 జనవరి 9-10 తేదీలలో జరగనున్న ఈ సదస్సులో సదస్సులో లో “మనీ పవర్ ఇన్ పాలిటిక్స్” అంశం పై మాజీ ఎంపీ ‌కవిత ప్రసంగించనున్నారు.

రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, జాతీయ ఎలక్షన్ కమీషనర్ అశోక్ లావస, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్, బీజేపీ నేత రాంమాధవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్, , సీపీఎం జాతీయ కార్యదర్శి ఏచూరి, లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ్, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో పాటు , వివిధ రంగాలకు చెందిన 30 కి పైగా ప్రతినిధులు ‌ఈ సదస్సులో పాల్గొననున్నారు.

ISB Invites Kalvakuntla Kavitha,Indian Democracy at Work Conference,Kalvakuntla Kavitha at ISB,Money Power In Politics,Venkaiah Naidu,EX.MP Kavitha,kavitha gets prestigious invitation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *