రామ్, పూరీ కాంబోకి అంత ఉందా?

Spread the love

ram, puri ismart shankar hype

వాస్త‌వం మాట్లాడుకుంటే… ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కి సాలిడ్ హిట్ ఈ మ‌ధ్య లేదు. బాల‌కృష్ణ లాంటి స్టార్ హీరోతో తీసిన పైసా వ‌సూల్ కూడా బాక్సీఫీస్ ముందు చీదేసింది. ఆత‌రువాత‌, మెహ‌బూబా… అది కూడా తుస్..! నిర్మాత‌ల‌కూ డిస్ట్రిబ్యూట‌ర్లు నాలుగు పైస‌లు మిగిల్చిన పూరీ చిత్రాలు ఈ మ‌ధ్య లేదు. అలాంటప్పుడు ద‌ర్శ‌కుడు పూరీకి ఫ‌లానా ఇంత మార్కెట్ ఉంద‌ట అని ఎవ‌రైనా అంటే ఎలా న‌మ్మ‌తారు..? లేద‌ని ఎవ్వ‌రూ అన‌డం లేదు.. మ‌రీ పెద్ద నంబ‌ర్లు చెబితేనే విన‌డానికి అదోలా ఉంటుంది క‌దా! హీరో రామ్ ప‌రిస్థితి కూడా దాదాపుగా పూరీకి అటుఇటుగానే ఉంది. ఉన్న‌ది ఒక‌టే జిదింగీ ఆడ‌లేదు. హ‌లో గురూ ప్రేమ‌కోస‌మే కూడా అంతే! నిర్మాతలు డ‌బ్బులొచ్చాయ‌ని చెప్పుకున్నాగానీ… డిస్ట్రిబ్యూట‌ర్లకు లాభమేం లేదు!

ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ద‌ర్శ‌కుడు, హీరో కలిసి ప‌నిచేస్తే కొత్త‌గా మార్కెట్ ఎలా వ‌చ్చేస్తుంది? ఈ కాంబోకి దాదాపు రూ. 15 నుంచి 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఉందంటే నిజ‌మేనా అని అనుమానించాల్సి వ‌స్తుంది క‌దా? ఇస్మార్ట్ శంక‌ర్ విష‌యంలో ఛార్మీ చేస్తున్న ప్ర‌చారం ఇదేన‌ట‌! ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ మీద పిచ్చ అంచనాలున్నాయీ, క్రేజు మామూలుగా లేదూ… సినిమా విడుద‌ల‌కు ముందే దాదాపు రూ. 20 కోట్ల‌కు చేరిపోతామ‌ని అంటోంద‌ట ఛార్మీ! అంటే, ఈ లెక్క‌న రూ. 50 కోట్లు దాటేస్తుంద‌న్న అంచ‌నాలు పెంచాల‌ని ఛార్మీ ప్ర‌చారం చేస్తున్న‌ట్టుగా ఉంది. ఇదేదో ప్ర‌చారం వ‌ర‌కూ అయితే కొంత న‌యం, బ‌య్య‌ర్లూ ఎగ్జిబిట‌ర్ల‌కూ ఇదే చెబుతుంటే… అవునా, అంత ఉందా, మాకు తెలీదులే అన్న‌ట్టుగా కొంత‌మంది చూస్తున్నార‌ట‌! ఛార్మీ ఇలా అన‌వ‌స‌రంగా నంబ‌ర్లు పెంచేసి చెబితే… రేప్పొద్దున్న రామ్‌, పూరీ సినిమా అబౌ ఏవ‌రేజ్ గా (సూప‌ర్ హిట్ అవ్వాల‌నే కోరుకుందాం) ఆడినా దాదాపు రూ. 15 నుంచి 20 కోట్ల‌ మ‌ధ్య‌లో ఉంటుందనీ… అప్పుడు ఛార్మీ చెప్పిన లెక్క‌ల ప్ర‌కారం ఫ్లాప్ అనేగా ప్రేక్షకులు అనుకుంటారు..?‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *