బాబా ఆలయానికి ‌ఐఎస్ఓ సర్టిఫికేట్

7
ISO Certificate To Saibaba Temple
ISO Certificate To Saibaba Temple

ISO Certificate To Saibaba Temple

దిల్ సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్సీ ‌కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం సాయిబాబా ఆలయానికి వచ్చిన ఐఎస్ఓ సర్టిఫికేట్ ను ఆలయ కమిటీకి అందజేశారు. భక్తులకు వసతుల కల్పన, ప్రసాదానికి సంబంధించి, సాయిబాబా టెంపుల్ కు ఐఎస్ఓ సర్టిఫికేట్ రావడం గొప్ప విషయమన్న ఎమ్మెల్సీ కవిత, దేవాలయల అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్సీ ‌కవితకి ఆలయ అర్చకులు, సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తెలంగాణ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఎమ్మెల్సీ కవిత. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్, ఆలయ చైర్మన్ శివయ్య, ఐఎస్ఓ సర్టిఫికేషన్ మెంబర్ డా. విజయ రంగ పాల్గొన్నారు.

#Dilsukhnagar Saibaba Temple

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here