నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ 45

PSLVC 45 Successfully Launched

ఇస్రో ప్రయోగం సక్సెస్ ..

భారత దేశ రక్షణా వ్యవస్థలో మరో కీలక ఘట్టానికి అంకురార్పణ జరిగింది. పీఎస్ఎల్వీ సీ 45 ద్వారా పంపిన ఇమిశాట్ మన రక్షణా వ్యవస్థను పటిష్టం చేసేలా సమాచారం అందించనుంది. పీఎస్ఎల్వీ సీ 45 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.27 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్ఎల్వీ సీ 45 ద్వారా డీఆర్డీవోకు చెందిన ఎలక్ట్రానిక్ ఇంటలిజెన్స్ శాటిలైట్.. ఇమిశాట్‌ను నింగిలోకి పంపారు. దీంతో పాటు లిథువేనియా, స్పెయిన్, స్విట్జర్లాండ్, అమెరికాకు చెందిన 28 నానో ఉపగ్రహాలను వాటి కక్ష్యలో ప్రవేశపెట్టారు. డీఆర్‌డీవో రూపొందించిన ఇమిశాట్ బరువు 436కిలోలు. తక్కువ ఎత్తు కక్ష్యలో తిరిగే ఈ ఉపగ్రహం రక్షణశాఖకు ఎంతగానో ఉపయోగపడనుంది. శత్రు దేశాల రాడార్లకు సంబంధించిన సమాచారాన్ని ఇది సేకరిస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి సమాచార సేకరణ కోసం భారత్ విమానాలపైనే ఆధారపడుతోంది. ఇకపై అంతరిక్షం నుంచే ఈ పని పూర్తి చేసే అవకాశం లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *