నోట్ల రద్దు ఎఫెక్ట్ ..జ్యూవెలర్స్ కు ఐటీ షాక్

IT issues notices to jewellers

దేశంలో గతంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్‌ 2016లో పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన  విషయం తెలిసిందే. ఇక ఆ సమయంలో  బంగారు ఆభరణాలను పెద్ద ఎత్తున విక్రయించిన జ్యూవెలర్లకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 15,000 మంది జ్యూవెలర్లకు ట్యాక్స్‌ nనోటీసులను జారీ చేశారని ఇండియన్‌ బులియన్‌ అండ్‌ జ్యూవెలర్స్‌ అసోసియేషన్‌ వెల్లడించింది.

 2016 నవంబర్‌ 8న ప్రధాని నోట్ల రద్దును వెల్లడించగానే పెద్దసంఖ్యలో కస్టమర్లు  చాలా జ్యువెలరీ షాపులలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి పాతనోట్లను విడిపించుకున్నారని ఇక ఈ నేపధ్యంలో అప్పటి  కొనుగోళ్ళపై  జ్యూవెలరీ రంగానికి చెందిన వారి నుంచి పన్ను అధికారులు రూ 50,000 కోట్లు వసూలు చేయాలని అంచనా వేస్తున్నారని ఇండియన్‌ బులియన్‌ అండ్‌ జ్యూవెలర్స్‌ అసోసియేషన్‌  చెప్తోంది. ఇక దీనిపై కోర్టులో అప్పీల్‌కు వెళ్లదల్చుకునే వారు 20 శాతం డిపాజిట్‌ చేయడం, కేసు ఓడిపోతే మిగిలిన మొత్తం చెల్లించాల్సి రావడం పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుందని, జ్యూవెలర్లు రుణాలు చెల్లించడంలో డిఫాల్ట్‌ అయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .
ఇక అప్పటి పాత రాబడిపై పన్ను డిమాండ్‌ చేసే అధికారం పన్ను అధికారులకు ఉన్నప్పటికీ మొత్తం రాబడిని పన్నుగా డిమాండ్‌ చేయడం మాత్రం అసాధారణమని బులియన్‌ వర్గాలతో పాటు పన్ను నిపుణులూ పేర్కొంటున్నారు. ఈ ఏడాది పెద్దసంఖ్యలో జ్యూవెలర్లకు టాక్స్‌ డిమాండ్‌ నోటీసులు పంపారని, ఆర్థిక వ్యవస్థ 11 ఏళ్ల కనిష్టస్ధాయిలో ఇబ్బందులకు గురవుతుండటంతో పన్ను లక్ష్యాన్ని అధిగమించేందుకు జ్యూవెలర్లకు భారత సర్కార్ షాక్ ఇస్తుందని వారు వాపోతున్నారు.

IT issues notices to jewellers,demonitization , modi , bjp government , jewellers , tax , income tax, indian bulion and jewellers association

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *